IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Ticket Scam Hyderabad: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మే 3న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ టికెట్ల కుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి (3/36) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, మైదానం వెలుపల జరిగిన ఈ దందా ఇప్పుడు చర్చనీయాంశమైంది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌పై ఉప్పల్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరు కేవలం టికెట్లను ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా, అత్యంత ఖరీదైన కాంప్లిమెంటరీ టికెట్ల కోసం ఏకంగా వీవీఐపీల పేర్లను వాడుకోవడం గమనార్హం. జడ్జీలు, మంత్రులు, గవర్నర్ల వంటి ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తుల పేర్లతో నకిలీ లెటర్ హెడ్స్‌ను సృష్టించి, క్రికెట్ అసోసియేషన్ల నుంచి సుమారు రూ.22,000 విలువైన టికెట్లను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇలా ఉచితంగా పొందిన టికెట్లను బ్లాక్ మార్కెట్‌లో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
మల్కాజిగిరి డీసీపీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి ఒక మహీంద్రా థార్ వాహనం, ఐదు ఐపీఎల్ టికెట్లు, ఐదు మొబైల్ ఫోన్లతో పాటు ఫోర్జరీ చేసిన వీవీఐపీ లెటర్ హెడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు, బందోబస్తు విధుల్లో ఉండగానే ఈ ముఠాను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అనధికారిక వ్యక్తుల దగ్గర లేదా బ్లాక్ మార్కెట్‌లో టికెట్లు కొనుగోలు చేయవద్దని, అలా చేస్తే డబ్బులు పోవడమే కాకుండా చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. కేవలం అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు తీసుకోవాలని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
🚨 TRAFFIC ADVISORY – IPL 2026 MATCHES (UPPAL) 🚨
In view of Indian Premier League (IPL) 2026 cricket matches, a total of 07 matches are scheduled to be held on 05th, 13th, 18th, 21st April and 03rd, 06th, 22nd May 2026 at Rajiv Gandhi International Cricket Stadium, Uppal.… pic.twitter.com/riYTiT9ygS
— Malkajgiri Police (@MalkajgiriCop) May 2, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?