Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో తన మెరుపు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కీలక మ్యాచ్‌కు ముందు దైవదర్శనం చేసుకున్నారు. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించే ఈ యువ కెరటం, భక్తి భావంతో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
ప్రస్తుత సీజన్లో అభిషేక్ శర్మ ఆడుతున్న తీరు అద్భుతం. సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వడంలో ఆయనది కీలక పాత్ర. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో క్రీజులోకి వచ్చిన క్షణం నుండే బౌండరీల వేట మొదలుపెడుతున్నారు. ఆయన కొట్టే భారీ సిక్సర్లు, వేగవంతమైన అర్ధ సెంచరీలు హైదరాబాద్ జట్టుకు భారీ స్కోర్లు అందించడంలో ప్రధాన బలమయ్యాయి. కేవలం పరుగులే కాకుండా, ఆయన ఆడుతున్న స్ట్రైక్ రేట్ చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు చెమటలు పడుతున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు..
మే 3వ తేదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR)తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ కీలక పోరుకు ముందు అభిషేక్ శర్మ నగరంలోని కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. సాధారణ ఆఫ్-వైట్ టీ షర్ట్ ధరించి, నుదుట ఎర్రటి తిలకం దిద్దుకుని చాలా ప్రశాంతంగా కనిపించారు.
Abhishek Sharma at Karmanghat Hanuman Temple for blessings ❤️🙏 pic.twitter.com/ph3OLVkwct
— Johns. (@CricCrazyJohns) May 2, 2026
ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మ్యాచ్‌లో విజయం సాధించాలని మొక్కుకున్నారు. హనుమంతుడి విగ్రహం ముందు ఆయన భక్తితో చేతులు జోడించి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగరంలో ఉన్న సమయంలో అభిషేక్ శర్మ కేవలం కర్మన్‌ఘాట్ ఆలయమే కాకుండా, అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాలను కూడా దర్శించుకోవడం విశేషం.
అభిషేక్ శర్మ పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. “జై భజరంగబలి” అంటూ కామెంట్స్ చేస్తూ, రేపటి మ్యాచ్‌లో ఆయన మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. ఆటలో ఎంత వేగంగా ఉంటారో, బయట అంత ప్రశాంతంగా, సంప్రదాయబద్ధంగా ఉండటం చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోయే ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగాలన్నా, ప్లే-ఆఫ్స్ దిశగా దూసుకుపోవాలన్నా అభిషేక్ శర్మ ఇచ్చే ఆరంభం జట్టుకు ఎంతో అవసరం. దైవ దీవెనలతో ఈ యువ ఆటగాడు రేపు మైదానంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్‌తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్‌నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!