RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నా ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..

Rcb

Rcb

రాయ్‌పూర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచిన RCB, ప్లేఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది. 193 పరుగుల భారీ లక్ష్యాన్ని విరాట్ కోహ్లీ అజేయ సెంచరీతో (60 బంతుల్లో 105) మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంతో RCB 12 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ప్లేఆఫ్స్ అవకాశాలు..
పాయింట్ల పట్టికలో RCB టాప్‌లో ఉన్నప్పటికీ, ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు గుజరాత్ టైటాన్స్‌కే (94.8%) ఎక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల అవకాశాలు చూస్తే.. RCBకి 92.6 శాతం, సన్‌రైజర్స్ హైదరాబాద్ కు 64.7 శాతం, పంజాబ్ కింగ్స్ కు 62.8 శాతం, చెన్నై సూపర్ కింగ్స్ కు 41.7 శాతం, రాజస్థాన్ రాయల్స్ కు 40.6 శాతం, KKRకు కేవలం 1.8 శాతం (మిగిలిన 3 మ్యాచ్‌లు గెలిచినా అర్హత సాధించడం కష్టమే) మాత్రమే ఉన్నాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 1 శాతం ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.