ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ అవుట్ అయిన విచిత్రమైన తీరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ చావోరేవో పోరులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సుదర్శన్, వరుసగా రెండోసారి ‘హిట్ వికెట్’ రూపంలో పెవిలియన్ చేరడంపై అభిమానులు, విశ్లేషకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఒకే తప్పు.. రెండోసారి!
మ్యాచ్‌లో గుజరాత్ జట్టు 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది. ఓపెనర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ కేవలం 32 బంతుల్లోనే 58 పరుగులు చేసి మ్యాచ్‌ను గుజరాత్ చేతుల్లోకి తెచ్చాడు. అయితే, 13వ ఓవర్లో బ్రిజేష్ శర్మ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సుదర్శన్, ఊహించని విధంగా చేతిలోంచి బ్యాట్‌ను వదిలేశాడు. ఆ బ్యాట్ నేరుగా వెళ్లి స్టంప్స్‌ను తాకడంతో అతడు ‘హిట్ వికెట్’గా వెనుదిరిగాడు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇలా ఒకే తప్పును పునరావృతం చేయడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
కెప్టెన్ గిల్ ఆవేదన.. నెట్టింట మీమ్స్ హల్‌చల్
సుదర్శన్ అవుట్ అయిన వెంటనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పిచ్‌పైనే మోకాళ్లపై కూలబడి, తల పట్టుకుని కూర్చుండిపోయాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా టాక్: “పాపం శుభ్‌మన్ గిల్.. జట్టును గెలిపించడానికి ఎంత కష్టపడుతున్నాడో, సుదర్శన్ మాత్రం ఇలాంటి వింత అవుట్లతో కెప్టెన్‌కు బీపీ తెప్పిస్తున్నాడు. గిల్ తల పట్టుకోక ఏం చేస్తాడు?” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అభిమానులు ఈ అవుట్‌పై క్రేజీ మీమ్స్‌తో సెటైర్లు వేస్తున్నారు. బ్యాట్ పట్టుకోవడం చేతకాకపోతే చేతికి ఫెవికాల్ రాసుకుని క్రీజులోకి రావాలంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అంతే కాకుండా.. ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఇలా చిన్నపిల్లాడిలా బ్యాట్ వదిలేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఫైనల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గింతే స్వయంగా సాయి సుదర్శన్ చేతికి, బ్యాట్‌కు కలిపి గట్టిగా ప్లాస్టర్ వేసి పంపాలేమో అంటూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
This is how the Sai Sudharshan Escapes from Hit wicket 😭😭
This video deserves Reach 💛#IPLFinals #RRvsGT #GTvsRR #RCB pic.twitter.com/yV8yjLPPS1
— 🦋 Rithvika🕊️ (@NyxDoll_21) May 30, 2026
🚨 MASSIVE STATEMENT BY SHUBMAN GILL ON SAI SUDHARSHAN HIT WICKETS 🚨
“I don’t think no one has seen anything like that. Two matches in a row, the way he got out. I saw some video on social media about taping his hand, I think I am going to have to do that in the next match.”…
— Cricket Central (@CricketCentrl) May 30, 2026
క్వాలిఫయర్-2 లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో బ్యాట్ గ్రిప్‌పై కనీస అవగాహన లేకపోవడం ఏంటని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కొందరు ఫ్యాన్స్ మాత్రం దీని వెనుక ఉన్న సాంకేతిక లోపాన్ని ఎత్తిచూపుతున్నారు. సాయి సుదర్శన్ వాడుతున్న గ్లోవ్స్ లేదా బ్యాట్ గ్రిప్‌లో సమస్య ఉండి ఉంటుందని, విపరీతమైన చెమట వల్ల బ్యాట్ చేతిలోంచి జారిపోతుండవచ్చని అంచనా వేస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ సమయానికైనా అతడు తన గ్లోవ్స్‌ను మార్చుకోకపోతే గుజరాత్ జట్టుకు భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఫైనల్ పోరుపై ఉత్కంఠ..
హాఫ్ సెంచరీతో అదరగొట్టినప్పటికీ, బాధ్యతారహితమైన రీతిలో వికెట్ సమర్పించుకుని జట్టును ఒత్తిడిలోకి నెట్టడంపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లోనైనా సాయి సుదర్శన్ ఇలాంటి బండ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నారు. మరి ఈ మెగా ఫైనల్లోనైనా సుదర్శన్ అలర్ట్ అవుతాడో లేదో చూడాలి.

