Hardik Pandya: ప్లేఆఫ్స్ నుంచి ముంబై ఔట్.. వైఫల్యాన్ని నిజాయితీ ఒప్పుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: నిన్న (శనివారం) చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబై కేవలం 159 పరుగులు మాత్రమే చేయగా, చెన్నై 19వ ఓవర్‌లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన జట్టు వైఫల్యాన్ని అత్యంత నిజాయితీగా అంగీకరించాడు. కేవలం ఆ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదు, ఈ సీజన్ మొత్తంలోనూ తమ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశాడు. ప్రత్యర్థి జట్టు అన్ని విభాగాల్లోనూ తమ కంటే మెరుగ్గా రాణించిందని, అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పైచేయి సాధించారని కొనియాడాడు. ఒక దశలో స్కోరు 180 నుంచి 190 వరకు వెళ్తుందని ఆశించామని, కానీ 10 ఓవర్ల తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. సరైన ముగింపు దక్కకపోవడం వల్లే ఆశించిన స్కోరును అందుకోలేకపోయామని వివరించాడు.
మైదానంలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. క్రీజులోకి వచ్చిన వెంటనే భారీ షాట్లు ఆడటం సులభం కాలేదని, సెట్ అయిన బ్యాటర్లు సైతం ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చలాయించలేకపోయారని పాండ్యా పేర్కొన్నాడు. లెక్కలతో కూడిన క్రికెట్ ఆడుతూ, చేతిలో వికెట్లు ఉంచుకోవడంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారని, ప్రత్యర్థి బౌలర్లు అత్యుత్తమంగా బౌలింగ్ చేయడమే ఇందుకు కారణమని చెప్పాడు. ఇక బౌలింగ్ విభాగంలో మరింత దూకుడుగా ఉండాల్సిందన్న ప్రశ్నపై స్పందిస్తూ.. బంతులకు బదులు నిప్పులు కురిపిస్తే తప్ప ఆ వికెట్లు తీయలేమేమో అన్నట్లుగా వ్యంగ్యంగా బదులిచ్చాడు. తమ వద్ద ఉన్న బౌలర్లనే ఉపయోగించుకున్నామని, కానీ ప్రత్యర్థి బ్యాటర్లు ఎంతో తెలివిగా ఆడి గెలిచారని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇదిలా ఉండగా.. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!