Ruturaj Gaikwad: అతడు సీఎస్‌కే ‘బ్యాక్ బోన్’.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ruturaj Gaikwad: నిన్న జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్(DC), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మ్యాచ్‌లో సీఎస్కే అదరగొట్టింది. సంజు శామ్సన్ మరోసారి రెచ్చిపోయాడు. దీంతో చెన్నై 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు 17.3 ఓవర్లలోనే ఛేదించారు. ఇక ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టు ప్రదర్శనపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సీజన్ ఆరంభంలో రెండు, మూడు మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, తాను, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉన్నామని స్పష్టం చేశాడు. గత ఏడాది కంటే ఈసారి తమ జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉందని, కేవలం ఆ ఊపు కోసం మాత్రమే ఎదురుచూశామని, వరుస విజయాలు అందరినీ జట్టుగా ఏకం చేశాయని రుతురాజ్ పేర్కొన్నారు.
ముఖ్యంగా సంజూ శామ్సన్ జట్టులోకి రావడం తమకు పెద్ద ప్లస్ పాయింట్ అని, వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ ఇప్పుడు సీఎస్‌కే బ్యాటింగ్ వెన్నెముకగా మారాడని రుతురాజ్ కొనియాడాడు. అయితే కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా, బౌలింగ్ విభాగమే టోర్నీలను గెలిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. భారీగా పరుగులు నమోదవుతున్న ఈ ఫార్మాట్‌లో అకీల్ హొస్సేన్, జేమీ ఓవర్టన్ వంటి బౌలర్లు నిశ్శబ్దంగా తమ పనిని పూర్తి చేస్తూ తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయడం కెప్టెన్‌గా తనకు ఎంతో నమ్మకాన్ని ఇస్తోందన్నాడు. అన్షుల్ కాంబోజ్‌కు ఈ మ్యాచ్‌లో కలిసి రాకపోయినా, అతను చాలా తెలివైన బౌలర్ అని, తన తప్పులను సరిదిద్దుకుని మళ్ళీ బలంగా తిరిగి రావాలనే పట్టుదల అతనిలో కనిపిస్తోందని రుతురాజ్ మద్దతుగా నిలిచాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇక, మైదానంలో సంజూ శామ్సన్, రుతురాజ్ ఇద్దరూ దాదాపు ఒకే రకమైన శైలిని కలిగి ఉంటారు. వీరిద్దరి మధ్య ప్రణాళికల గురించి అడగ్గా.. పిచ్ ఎలా స్పందిస్తోంది, ఆటను ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై మాత్రమే తాము చర్చించుకుంటామని, అంతకుమించి ఎక్కువ మాట్లాడుకోమని రుతురాజ్ వెల్లడించారు. మైదానంలో ఎవరికి వారు తమ బాధ్యతను గుర్తిస్తారని, ప్రస్తుతం సంజూ తన పనిని అద్భుతంగా చేస్తున్నాడని కితాబిచ్చాడు. యువ ఆటగాడు కార్తీక్ శర్మ గురించి మాట్లాడుతూ.. అతనిలో నైపుణ్యం మొదటి నుంచీ ఉందని, కేవలం తగిన సమయం కోసం మాత్రమే వేచి చూశాడని చెప్పాడు. అతను కేవలం భారీ షాట్లు కొట్టే ఆటగాడు మాత్రమే కాదని, స్ట్రైక్ రొటేట్ చేస్తూ అన్ని వైపులా ఆడగల సత్తా ఉన్న క్రికెటర్ అని, గత రెండు మ్యాచ్‌లుగా అతను ఆత్మవిశ్వాసంతో ఆడుతుండటం జట్టుకు శుభపరిణామమని రుతురాజ్ గైక్వాడ్ వివరించాడు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!