Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్‌కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar IPL Team: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ అయిన Indian Premier League (IPL) రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఐపీఎల్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే బీహార్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అగర్వాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్లా.. బీహార్‌కు కూడా ఒక ఐపీఎల్ జట్టు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీహార్‌లో ప్రతిభకు కొదవ లేదని, అయినా ఆ రాష్ట్రానికి ఇప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం బాధ కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
బీహార్ నుంచి వెలుగొందుతున్న క్రికెటర్లు
అనిల్ అగర్వాల్ తన సోషల్ మీడియా పోస్టులో బీహార్‌కు చెందిన పలువురు యువ క్రికెటర్ల ప్రతిభను ప్రస్తావించారు. పాట్నాకు చెందిన ఇషాన్ కిషన్ వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందారని చెప్పారు. అలాగే సమస్తిపూర్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడని గుర్తు చేశారు. మరోవైపు గోపాల్‌గంజ్‌కు చెందిన సాకిబ్ హుస్సేన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో గుర్తింపు తెచ్చుకుంటున్నాడని పేర్కొన్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
“బీహార్‌కు సరైన గుర్తింపు రావడం లేదు”
“క్రికెట్లో బీహార్‌కు దక్కాల్సిన గుర్తింపు ఇప్పటికీ రావడం లేదు అనే విషయం నన్ను ఎప్పుడూ బాధిస్తుంది” అని పేర్కిన్నారు అనిల్ అగర్వాల్.. బీహార్ యువతకు సరైన మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహం లభిస్తే ప్రపంచ స్థాయి జట్టును నిర్మించగల సామర్థ్యం ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. క్రీడాకారులు తమ రాష్ట్రంలోనే ప్రపంచ స్థాయి శిక్షణ, సౌకర్యాలు పొందాలని తన కల అని చెప్పారు.
క్రీడలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం
బీహార్ క్రికెట్ అభివృద్ధికి తాను పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అనిల్ అగర్వాల్ స్పష్టం చేశారు. “నాకు బీహార్ కేవలం ఒక రాష్ట్రం కాదు.. అది ఒక భావోద్వేగం” అని ఆయన పేర్కొన్నారు. బీహార్ యువతకు సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టు అక్కడి నుంచే వస్తుందని తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం విస్తరించిన అనిల్ అగర్వాల్
కాగా, వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ బీహార్ వాస్తవ్యులు.. బీహార్లోనే జన్మించి పెరిగిన ఆయన.. ప్రస్తుతం తన వ్యాపార సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.. ఆయన నికర ఆస్తి విలువ వేల కోట్ల రూపాయలుగా అంచనా వేయబడుతోంది. ఇప్పుడు ఆయన చేసిన “బీహార్ ఐపీఎల్ జట్టు” వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. చాలామంది క్రికెట్ అభిమానులు కూడా బీహార్‌కు ఐపీఎల్ జట్టు రావాలని అభిప్రాయపడుతున్నారు.. అనిల్ అగర్వాల్ మాటలు చూస్తుంటే.. బీహార్ జట్టే ఏర్పాటు అయితే.. ఆయనే ఓనర్ కూడా అవుతారేమో చూడాలి..
क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?
बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।
पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd
— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..