Site icon NTV Telugu

IPL 2026 Mini Auction: రేపే IPL 2026 మినీ వేలం.. ఏ జట్టు వద్ద ఎంత పర్సు ఉందంటే..?

Ipl

Ipl

IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం రేపు (డిసెంబర్ 16న) అబుదాబీలో జరగనుంది. వేలానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో, పది ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ జట్లను మరింత బలపరిచేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి రెండో భాగంలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ మినీ వేలంలో మొత్తం 77 మంది ప్లేయర్స్ ని తీసుకోనున్నారు.

Read Also: Lok sabha: కాంగ్రెస్ వ్యాఖ్యలపై రగడ.. పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ నిరసన

అయితే, ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు గరిష్ఠంగా రూ.237.55 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రూ.64.3 కోట్ల అత్యధిక పర్సుతో వేలానికి వెళ్తుంది. మినీ వేలం చరిత్రలో ఏ జట్టు దగ్గర కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ఉండటం గమనార్హం. దీంతో వేలంలో జరిగే బిడ్డింగ్ ను నిర్ణయించే శక్తి కేకేఆర్ చేతుల్లోనే ఉండనుందని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read Also: Kerala sexual case: ఆమె పోరాటం ఫలించింది.. మలయాళ నటికి అండగా నిలిచిన పృథ్వీరాజ్

ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కూడా రూ.43.4 కోట్ల పర్సుతో వేలంపై ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్రతిభావంతులను జట్టులోకి తీసుకోవడంపై సీఎస్‌కే దృష్టి సారించినట్లు సమాచారం. కాబట్టి, ప్రధానంగా కీలక ఆటగాళ్ల కొనుగోలులో కేకేఆర్, సీఎస్కే మధ్య పోటీ నెలకొనే ఛాన్స్ అధికంగా ఉంది. మొత్తంగా ఐపీఎల్ 2026 మినీ వేలం జట్ల భవితవ్యాన్ని నిర్ణయించే కీలక ఘట్టం స్టార్ట్ కాబోతుంది. భారీ పర్సులతో బరిలోకి దిగుతున్న జట్లు ఎలాంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకుంటాయి అన్నది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

ఏ జట్టు వద్ద ఎంత పర్సు ఉందంటే..?
కోల్‌కతా నైట్ రైడర్స్ ( రూ. 64.3 కోట్లు)
చెన్నై సూపర్ కింగ్స్ ( రూ. 43.4 కోట్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ ( రూ. 25.5 కోట్లు)
లక్నో సూపర్ జెయింట్స్ ( రూ. 22.95 కోట్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ ( రూ. 21.8 కోట్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( రూ. 16.4 కోట్లు)
రాజస్థాన్ రాయల్స్ ( రూ. 16.05 కోట్లు)
గుజరాత్ టైటాన్స్ ( రూ. 12.9 కోట్లు)
పంజాబ్ కింగ్స్ ( రూ. 11.5 కోట్లు)
ముంబై ఇండియన్స్ ( రూ. 2.75 కోట్లు)

Exit mobile version