IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరోసారి యెల్లో జెర్సీలో అభిమానులను అలరించేందుకు మహేంద్ర సింగ్ ధోనీ రెడీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆయన మరో సీజన్ ఆడనుండటం ఫిక్స్ అయింది. ధోనీ రిటైర్మెంట్ తర్వాతి జట్టు ఎలా ఉండాలనే దాని కోసం CSK ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం ధోనీ జట్టులో కీ రోల్ కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ 2025 తొలి అర్ధభాగంలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బయటకు వెళ్లిన సమయంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా మళ్లీ ధోనీనే భుజాన వేసుకున్నారు.
Read Also: Trump-White House: జో బైడెన్ చెత్త అధ్యక్షుడు.. వైట్‌హౌస్‌లో అధ్యక్షుల చిత్రపటాల కింద రాతలు
ఇక, అన్‌క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనీని CSK రిటైన్ చేసుకోవడంతో, ఐపీఎల్ 2026లో ఆయనకు రూ.4 కోట్లు చెల్లిస్తుంది. ఒకప్పుడు ఐపీఎల్‌లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా ఉన్న ధోనీ, ఐపీఎల్ 2026లో MSD కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ప్లేయర్స్ CSKలో ఎనిమిది మంది ఉన్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2022, 2025 మెగా వేలాలకు ముందే అతడ్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2024కు ముందు జట్టు పగ్గాలు చేపట్టిన రుతురాజ్, 2026లో రూ.18 కోట్లు తీసుకుంటున్నాడు. అలాగే, సంజూ శాంసన్ కూడా రూ.18 కోట్లు అందుకునే ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.
Read Also: Raju weds Rambhai : ఓటీటీలోకి వచ్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అలాగే, శివమ్ దూబే రూ.12 కోట్లు, నూర్ అహ్మద్ రూ.10 కోట్లు, ఖలీల్ అహ్మద్ రూ.4.80 కోట్లను గత సీజన్ నుంచి కొనసాగుతుండగా.. తాజాగా ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను CSK రూ.14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. దీంతో వీరిద్దరూ ధోనీ కంటే రూ.10.20 కోట్లు ఎక్కువ జీతం పొందే ప్లేయర్స్ లిస్టులో చేరారు. దీంతో పాటు రూ.5.20 కోట్ల జీతంతో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహార్ కూడా ధోని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడు. కాగా, ఈ పరిణామాలతో ధోనీ జీతం తక్కువగా ఉన్నప్పటికీ, జట్టులో ఆయన ప్రాధాన్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా మాత్రమే కాకుండా, మెంటార్‌గా, మార్గనిర్దేశకుడిగా CSK భవిష్యత్తుకు ధోనీ ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐపీఎల్ 2026లో కూడా ధోనీ ఉనికి చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
