Site icon NTV Telugu

IPL 2025 Final: సాయంత్రం 6 గంటలకే ఐపీఎల్ ముగింపు వేడుకలు..

Ipl

Ipl

IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2025 ముగింపు వేడుకలు ఈ రోజు (జూన్ 3న) సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతుంది. ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ గాయకుడు శంకర్‌ మహదేవన్‌, ఆయన కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ పాల్గొంటారని తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్‌లో సేవలందించిన భారత త్రివిధ దళాల ప్రతినిధులను ఈ సందర్భంగా బీసీసీఐ సత్కరించనుంది. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించనున్నారు.

Read Also: YS Jagan: కేసులును నేను వెనకేసుకురావడం లేదు.. కానీ, మీరే జడ్జిమెంట్ ఇస్తారా…?

అయితే, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫైనల్‌లో తల పడనున్నాయి. ఆర్సీబీ ఇంతకు ముందు 2009, 2011, 2016లో ఐపీఎల్‌ ఫైనల్‌కు వెళ్లింది. కానీ గెలుపు ముంగిట బోల్తా కొట్టింది. తిరిగి మళ్లీ చాలా రోజుల తర్వాత 2025 సీజన్‌లో నాలుగోసారి ఫైనల్‌కు దూసుకొచ్చింది బెంగళూరు జట్టు. ఇక, పంజాబ్‌ కింగ్స్‌ విషయానికొస్తే.. 2014లో ఒకసారి ఫైనల్‌కు వచ్చిన.. తర్వాత తిరిగి 11 ఏళ్లకు ఆ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లకు 18 ఏళ్లుగా ఐపీఎల్‌ ట్రోఫీ గెలవడం తీరని కలగా మిగిలిపోయింది. కాబట్టి, ప్రస్తుతం ఐపీఎల్ 2025 ట్రోఫీని ఏ జట్టు గెలిచినా.. వారికి ఇదే తమ తొలి కప్ కానుంది.

Exit mobile version