NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ కెప్టెన్ల ఫోటోషూట్.. ఒక్కడే విదేశీ కెప్టెన్ (ఫొటో)

Ipl 2025 Captains Photoshoo

Ipl 2025 Captains Photoshoo

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల ఫోటోషూట్ గురువారం (మార్చి 20)న ముంబైలోని ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగింది. ఈ ఫోటోషూట్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం నిర్వహించారు. అరేబియా సముద్రానికి ఎదురుగా ఉన్న చారిత్రాత్మక స్మారక చిహ్నం ముందు కెప్టెన్లు ఫోజులిచ్చారు.

Read Also: Chhava: ‘‘ఛావా’’ సినిమాని నిషేధించాలి.. అమిత్ షాకి ముస్లిం సంస్థ చీఫ్ లేఖ..

ఈ సీజన్‌లో పాట్ కమ్మిన్స్ మాత్రమే ఏకైక విదేశీ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టును ముందుకు నడిపించి.. విప్లవాత్మక ఆటతీరుతో టోర్నమెంట్‌లో కొత్త శకం ప్రారంభించాడు. సన్ రైజర్స్ 2024 ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు చేసిన టాప్ 5 మ్యాచ్‌లలో మూడింటిని (287, 277, 266).. కమిన్స్ నాయకత్వంలోనే చేశారు. మరోవైపు.. గత సీజన్‌లో విజేత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌.. పాట్ కమ్మిన్స్ పక్కన మధ్యలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతున్న అయ్యర్.. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు టైటిల్‌ అందించాడు.

Read Also: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..

ఎవరెవరు ఎక్కడున్నారంటే..?
పాటిదార్ (RCB), హార్దిక్ పాండ్యా (MI), అక్షర్ పటేల్ (DC) ఎడమ వైపున ఉన్నారు.
శుభ్‌మాన్ గిల్ (GT), సంజు సామ్సన్ (RR) అయ్యర్ కుడి వైపున ఉన్నారు.
చివరిలో రిషబ్ పంత్ (LSG), అజింక్య రహానే (KKR) ఉన్నారు.