NTV Telugu Site icon

Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే.. నిమిషానికే టికెట్లు సోల్డ్‌ అవుట్‌!

Uppal Stadium

Uppal Stadium

Hyderabad Fans disappointed again on IPL 2024 Uppal Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పడం లేదు. ఏప్రిల్ 25న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచ్ ఉండగా.. మే 2న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లకు సంబందించిన టికెట్లను నిర్వాహకులు పేటీఎం ఇన్‌సైడర్ యాప్‌లో విక్రయానికి పెట్టారు. అందుబాటులోకి తీసుకొచ్చిన నిమిషానికే సోల్డ్‌ అవుట్‌ అని చూపిస్తోంది.

Also Read: Bhaje Vaayu Vegam First Look: ‘భజే వాయు వేగం’ ఫస్ట్‌ లుక్‌.. బ్యాట్‌తో కార్తికేయ పరుగులు!

ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ పేటీఎంలో సోల్డ్‌ అవుట్‌ అని కనిపించడం, వెయిటింగ్ లిస్ట్ దాదాపు 10 వేల వరకు ఉండడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం పేటీఎంలో ఎన్ని టికెట్లు విక్రయానికి పెడుతోందో లెక్క చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారని ఫాన్స్ ఆరోపిస్తున్నారు. పేటీఎంలో టికెట్స్ పెట్టకున్నా స్టేడియం మొత్తం నిడిపోతుందంటే.. బ్లాక్‌ టికెట్ల దందా ఏ రేంజ్‌లో సాగుతుందో అర్ధమవుతుందని ఫాన్స్ అంటున్నారు. ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ విషయంలో ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నా.. హెచ్‌సీఏ ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

Show comments