NTV Telugu Site icon

IPL 2024 Playoffs Scenario: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం.. రెండు స్థానాలకు నాలుగు జట్ల మధ్య పోటీ! ఆర్‌సీబీకి కష్టమే

IPL 2024 Playoffs Chances: ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. మార్చి 22 ఆరంభం అయిన ఈ టోర్నీ.. నెల రోజుల‌కు పైగా క్రికెట్ ఆభిమానుల‌ను అలరిస్తోంది. ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 16 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన‌ రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది. ఆ టీమ్స్ ఏవి, ఏ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో ఉన్న స‌న్‌రైజ‌ర్స్.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళుతుంది. స‌న్‌రైజ‌ర్స్ ఫామ్ చూస్తే.. ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 6 విజయాలతో 12 పాయింట్స్ ఉన్న చెన్నై.. నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచ్‌లలో రెండు గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళుతుంది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్‌ సింగ్

ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూపర్ జెయింట్స్ సైతం ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. ప్ర‌స్తుతం ఢిల్లీ, ల‌క్నోలు 12 పాయింట్ల‌తో వ‌రుస‌గా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లలో ఓడితే.. ఢిల్లీ, లక్నోకు చాన్స్ ఉండదు. ఇక రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకి అవ‌కాశం దాదాపు లేదు. ప్ర‌స్తుతం ర‌న్ రేటే -0.09, ఎనిమిది పాయింట్ల‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మిగ‌తా మూడు మ్యాచ్‌లను క‌చ్చితంగా భారీ తేడాతో గెల‌వాలి. అంతేకాదు చెన్నై, ల‌క్నో, ఢిల్లీ టీమ్స్ త‌ర్వాతి మ్యాచ్‌లలో ఓడిపోతేనే బెంగ‌ళూరు అవకాశం ఉంటుంది. ఇదంతా జరిగే పని కాదనే చెప్పాలి.

 

Show comments