Site icon NTV Telugu

IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. ఫ్రాంఛైజీలను నిరాశపరిచిన ప్లేయర్స్

Ipl Teams

Ipl Teams

ఐపీఎల్ సీజన్ 16కి ముందు జరిగిన మినీవేలంలో.. ఫ్రాంఛైజీలు ఒక్కొక్క ఆటగాడి కోసం కోట్ల రూపాయలను వెచ్చించాయి. ఇలా డబ్బులు కుమ్మరించడానికి కారణం ఉంది. కోట్ల రూపాయలు అందుకుంటున్న ఆయా ఆటగాళ్లు మ్యాచ్ స్థితి గతులను మార్చగల శక్తిని కలిగి ఉన్నారు. అది వాస్తవమే.. అయితే మినీ వేలంలో కోట్ల రూపాయలు అందుకున్న ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్ లోనే అభిమానులను నిరాశపరిచే ప్రదర్శన చేశారు.

Read Also : Kidney Stones : కాఫీ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి..?

గతేడాది డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముంబై ఇండియన్స్.. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ గ్రీన్ కోసం 17.5 కోట్లు వెచ్చించింది. గ్రీన్ తన తుఫాన్ బ్యాటింగ్, బౌలింగ్ తో జట్టుకు ఉపయోగపడతాడని అందరు భావించారు. కానీ గ్రీన్ తన తొలి మ్యాచ్ లో విఫలమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో అతను ముంబై తరపున కేవలం 5 పరుగులకే ఔట్ అయ్యాడు. బౌలింగ్ లో కూడా వేసిన రెండు ఓవర్లలో 30 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఫలితంగా గ్రీన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ముంబై 8 వికెట్ల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.

Read Also : Kidney Stones : కాఫీ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయి..?

సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇంగ్లండ్ కు చెందిన హ్యారీ బ్రూక్ ను రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడిని కలుపుకుని జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేసేందుకు సన్ రైజర్స్ జట్ట ప్రయత్నించారు. కానీ బ్రూక్ తన తొలి మ్యాచ్ లో 21 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Read Also : Ganta Srinivasa Rao and Buddha Venkanna: మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.. బెదిరింపుల నుంచి బుజ్జగింపులకు తగ్గారు..!

మరో ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ రూ. 16.25 కోట్లు వెచ్చించింది. అయితే గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.. అలాగే సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా 8 బంతులకు 8 పరుగులే చేసి బెన్ స్టోక్స్ ఔట్ అయ్యాడు. ఇక బౌలింగ్ లో కూడా ఒకే ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఫలితంగా స్టోక్స్ తన రెండు మ్యాచ్ లలోనూ విఫలమై చెన్నైని నిరాశపరిచాడు.

Read Also : Balakrishna: తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్.టి.ఆర్.!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు సామ్ కరణ్ కూడా పంజాబ్ కింగ్స్ ను నిరాశపరిచాడని చెప్పుకోవాలి. అతని కోసం పంజాబ్ ఏకంగా 18.5 కోట్ల రూపాయలు చెల్లించింది. ఐపీఎల్ సీజన్ 16లో కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో కరణ్ 17 బంతుల్లో 26 పరుగుుల చేశాడు. అలాగే బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి.. ఒక్క వికెట్ తీసుకున్నాడు. అయితే గ్రీన్, స్టోక్స్, బ్రూక్ లతో పోలిస్టే కరణ్ తొలి మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేశాడని చెప్పుకోవచ్చు..

Exit mobile version