NTV Telugu Site icon

SRH vs RCB: భారీ స్కోరు చేసిన ఆర్సీబీ.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే..?

Rcb

Rcb

ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు 207 పరుగుల స్కోరును ఉంచింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. డుప్లెసిస్ (25) పరుగులు చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (6) పరుగులు చేసి తొందర్లోనే పెవిలియన్ బాట పట్టాడు.

Read Also: Gundu SudhaRani: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన గుండు సుధారాణి

ఆ తర్వాత రజత్ పాటిదార్ (50) అర్థ సెంచరీతో రాణించాడు. చివరల్లో కెమెరాన్ గ్రీన్ (37*) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లోమ్రోర్ (7), దినేష్ కార్తీక్ (11), స్వప్నిల్ సింగ్ (12) పరుగులు చేయడంతో.. ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. హైదరాబాద్ బౌలింగ్ లో ఉనద్కత్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత నటరాజన్ 2 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు. కాగా.. సన్ రైజర్స్ బ్యాటింగ్ దాటికి ఈ స్కోరు సరిపోతుందా అనే సందేహం కలుగుతుంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో అందరు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నారు. చూడాలి మరీ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతారో…

Read Also: Tech Mahindra: త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన టెక్‌ మహీంద్రా.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్‌..

Show comments