Hardik Pandya: హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
- ఐపీఎల్ 2026లో ముంబై వరుస ఓటములు
- 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో ముంబై
- హార్దిక్‌ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో రెండే విజయాలు అందుకుంది. 4 పాయింట్లతో పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే.. లీగ్ దశలో మిగిలిన 6 మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ముంబై ఫామ్ చూస్తుంటే.. ప్లే ఆఫ్స్ చేరడం కష్టమనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విఫలమవుతున్న ఎంఐ.. ఐపీఎల్ 2026లో మూల్యం చెల్లించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య కెరీర్లో ఒక ఆసక్తికర అంశం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జట్టు ఏదైనా అద్భుతంగా ఆడుతూ కెప్టెన్లకు ట్రోఫీలు గెలిపించడంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ నాయకత్వంలో హార్దిక్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్లో 402 పరుగులు చేసి, 14 వికెట్లు పడగొట్టి ముంబై టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2020లో 281 పరుగులు చేసి మరోసారి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అంతేకాదు 2024 టీ20 ప్రపంచకప్‌లో 144 పరుగులు, 11 వికెట్లు తీసి భారత జట్టుకు ట్రోఫీ అందించడంలో కూడా హార్దిక్ కీలకంగా మారాడు. ఇలా రోహిత్ కెప్టెన్సీలో అతడు ఎన్నో విజయాలకు కారణమయ్యాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో కూడా హార్దిక్ పాండ్య తన ప్రభావాన్ని చూపించాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో 217 పరుగులు, 9 వికెట్లు తీసి జట్టుకు అద్భుత సహకారం అందించాడు. సూర్యకుమార్ కెప్టెన్సీలో కూడా భారత జట్టు ట్రోఫీ గెలవడంలో హార్దిక్ పాత్ర కీలకం. కెప్టెన్ ఎవరు అయినా సరే.. జట్టుకు అవసరమైన సమయంలో హార్దిక్ ముందుండి పోరాడుతున్నాడు. అయితే ఇంతటి అద్భుత ప్రదర్శనలు చేసిన హార్దిక్‌కు ఐపీఎల్లో మాత్రం అదే స్థాయి విజయాలు దక్కడం లేదు. ఐపీఎల్లో పాండ్యకు అదృష్టం కలిసిరావడం లేదని అభిమానులు అంటున్నారు.
రోహిత్ శర్మ, సూర్యకుమార్‌లకు వరల్డ్ కప్ గెలిపించిన హార్దిక్‌కు.. ఐపీఎల్ ట్రోఫీ మాత్రం వాళ్లు గెలిపించలేకపోయారు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ మండిపడుతున్నారు. హార్దిక్‌కు రోహిత్, సూర్యలు అసలు సహకరించడం లేదంటున్నారు. పేలవ ప్రదర్శనతో హార్దిక్‌ను నట్టేట ముంచేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. 2024లో రోహిత్ నుంచి హార్దిక్ ముంబై జట్టు పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి రోహిత్, సూర్యలు పెద్దగా రాణించడం లేదు. మరో ప్రధాన ఆటగాడు బుమ్రా కూడా తేలిపోతున్నాడు. అంతకు ముందు వరకు బాగా ఆడి.. హార్దిక్ సారథిగా రాగానే విఫలమయ్యారు. అందుకే ఫాన్స్ ఇలా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా హార్దిక్ లాంటి మ్యాచ్ విన్నర్ జట్టులో ఉండటం ఏ జట్టుకైనా అతిపెద్ద బలం. భవిష్యత్తులో ఐపీఎల్లో కూడా అతడికి అదృష్టం కలిసివచ్చి మరోసారి ట్రోఫీ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!