NTV Telugu Site icon

Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్

Hardik Record

Hardik Record

Hardik Pandya Creates Unique Record In IPL: ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. రాయస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్.. ఈ సందర్భంగా 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ క్రమంలోనే అతడు ఐపీఎల్‌లో 2000 పరుగులు పూర్తి చేయడంతో పాటు 50 వికెట్లు పడగొట్టిన ఆరో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇంతకుముందు ఈ ఫీట్‌ని ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ (3874 పరుగులు & 92 వికెట్లు), కైరన్ పొలార్డ్ (3412 పరుగులు & 69 వికెట్లు), రవీంద్ర జడేజా (2,531 పరుగులు & 138 వికెట్లు), జాక్స్ కాలిస్ (2,427 పరుగులు & 65 వికెట్లు), ఆండ్రూ రసెల్ (2,095 పరుగులు & 92 వికెట్లు) సాధించారు.

MP Avinash Reddy : కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేటి విచారణ వాయిదా.. రేపు రావాలని సీబీఐ నోటీసులు

ఇదిలావుండగా.. గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందించినప్పటికీ, ఒక చెత్త రికార్డ్‌ని తన పేరిట లిఖించుకుంది. పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి కేవలం 26 పరుగులే చేసిన ఈ జట్టు.. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యంత స్వల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. అయితే.. గుజరాత్‌పై రాజస్థాన్‌కు ఇది మొట్టమొదటి విజయం. గత సీజన్‌లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా.. ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ జట్టే గెలుపొందింది. ఇదే సమయంలో షిమ్రోన్ హెట్‌మేయర్ ఒక అరుదైన రికార్డ్‌ని కూడా నమోదు చేశాడు. మెరుపు హాఫ్‌ సెంచరీ చేసిన అతగాడు.. ఐపీఎల్‌లో ఐదో అత్యుత్తమ బ్యాటింగ్‌ స్ట్రయిక్‌ రేట్‌ (157.20) కలిగిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు (కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్లలో). ఈ విభాగంలో ఆండ్రూ రసెల్‌ (177.09) అగ్రస్థానంలో ఉన్నాడు.

Iftar party: గర్భవతి అయిన భార్యతో ఇలా ప్రవర్తిస్తాడా?.. నటి సనాఖాన్ భర్తపై నెటిజన్లు ఆగ్రహం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46) పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచారు. ఇక 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకి మొదట్లోనే పెద్ద ఝలక్‌లు తగిలాయి. జైస్వాల్, బట్లర్ వెనువెంటనే ఔటయ్యారు. 10.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 55 పరుగులే చేయడంతో.. రాజస్థాన్ ఓటమి తథ్యమని అంతా అనుకున్నారు. అప్పుడు సంజూ(32 బంతుల్లో 60) , హెట్‌మేయర్స్ (26 బంతుల్లో 56 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో.. రాజస్థాన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Show comments