Hardik Pandya Captaincy: ఐపీఎల్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి గండం..! మాజీ క్రికెటర్ తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Captaincy: ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఉన్నా.. ఈ ఐపీఎల్‌లో ముంబై జట్టు సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు.. తొలి మ్యాచ్‌లో విజయంతో బోణీ కొట్టినా ముంబై జట్టు.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటములు మూఠగట్టుకుంది.. హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తుండటంతో, అతని కెప్టెన్సీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటంతో జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో హార్దిక్ నాయకత్వంపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఓటమిపాలైంది. జట్టు బౌలింగ్ విభాగం అత్యంత బలహీనంగా మారింది. ఐదు మ్యాచ్‌ల్లో 972 పరుగులు ఇచ్చేసిన ముంబై బౌలర్లు 10.26 ఎకానమీ రేటుతో పరుగులను అడ్డుకోలేకపోతున్నారు. వికెట్లు తీయడంలోనూ విఫలమవడంతో జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేదు. నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 81 పరుగులు మాత్రమే చేసిన హార్దిక్, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఒక మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమైనప్పటికీ, అతని నుంచి మ్యాచ్ గెలిపించే ఇన్నింగ్స్ రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
హార్దిక్‌పై తీవ్ర విమర్శలు..
అయితే, మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రా.. హార్దిక్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ, “హార్దిక్ చివరిసారిగా ఒంటరిగా మ్యాచ్ గెలిపించిన ఇన్నింగ్స్ ఎప్పుడు ఆడాడో గుర్తులేదు. చిన్న చిన్న మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.. కానీ, జట్టును గెలిపించే 70-80 పరుగుల ఇన్నింగ్స్‌లు కనిపించడం లేదు” అని వ్యాఖ్యానించారు. జట్టు కొత్త ఆలోచనా విధానం, నిర్భయమైన ఆటతీరు అలవరుచుకోవాలని కూడా సూచించారు.
రోహిత్ శర్ము పగ్గాలు ఇవ్వాలి..!
ఇక, హార్దిక్ కెప్టెన్సీపై కూడా విమర్శలు పెరుగుతున్నాయి. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ, ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించాలని సూచించారు. జట్టులో స్థిరత్వం తీసుకురావాలంటే రోహిత్ నాయకత్వమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జట్టు వైఫల్యానికి పూర్తిగా హార్దిక్‌ను మాత్రమే బాధ్యుడిగా చేయడం సరైంది కాదనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం వరుసగా విఫలమవుతుండటం, భారీ స్కోర్లను కాపాడుకోలేకపోవడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. దీంతో బ్యాట్స్‌మెన్‌పై అదనపు ఒత్తిడి పడుతోంది. అయినప్పటికీ కెప్టెన్‌గా, సీనియర్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాత్ర ఎంతో కీలకం. అతను త్వరలోనే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయపథంలో నడిపిస్తాడా? లేక కెప్టెన్సీపై మరింత ఒత్తిడి పెరుగుతుందా? అన్నది ఇప్పుడు ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!