NTV Telugu Site icon

GT vs RR: ఉత్కంఠపోరులో గుజరాత్ గెలుపు.. రాజస్థాన్కు తొలి ఓటమి

Gt Won

Gt Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయం సాధిచింది. ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. ఆఖరి బంతికి టార్గెట్ ను చేధించింది. చివరలో రషీద్ ఖాన్ (24), రాహుల్ తెవాటియా (22) రాణించడంతో విక్టరీ సాధించింది.

గుజరాత్ బ్యాటింగ్ లో శుభ్ మాన్ గిల్ (72) పరుగులతో రాణించి జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. సాయి సుదర్శన్ (35) రన్స్ చేశాడు. విజయ్ శంకర్ (16), ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షారూక్ ఖాన్ (14) రన్స్ చేశాడు. ఒకానొక సందర్భంలో మ్యాచ్ రాజస్థాన్ వైపు ఉన్నప్పటికీ.. అద్భుతమైన షాట్లతో గుజరాత్ విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లు మొదటి 10 ఓవర్లు మంచిగా బౌలింగ్ చేసినప్పటికీ, డెత్ ఓవర్లలో మ్యాచ్ ను చేజార్చారు. రాజస్థాన్ బౌలింగ్ లో కుల్ దీప్ సేన్ 3 వికెట్లు తీశాడు. చాహల్ 2, ఆవేశ్ ఖాన్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ ఓటమితో ఈ సీజన్ లో రాజస్థాన్ తొలి ఓటమి నమోదు చేసుకుంది.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68) చెలరేగి ఆడారు. ఈ ఇద్దరి మధ్య 130 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) పరుగులు చేశాడు. బట్లర్ (8), హెట్మేయర్ (13) పరుగులు చేశాడు. గుజరాత్ బౌలింగ్ లో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.