Gujarat Titans Scored 227 Runs In 20 Overs Against LSG: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తాండవం చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ (94), వృద్ధిమాన్ సాహా (81) విజృంభించడం.. హార్దిక్ (25), మిల్లర్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. గుజరాత్ జట్టు ఇంత భారీ స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. లక్నో 228 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేధించాల్సి ఉంటుంది. మరి.. లక్నోకి అది సాధ్యం అవుతుందా? గుజరాత్ బ్యాటర్ల తరహాలో లక్నో బ్యాటర్లు విజృంభించగలరా?
Virat Kohli Row: కోహ్లీని మళ్లీ రెచ్చిగొట్టిన నవీన్.. గంభీర్ కూడా!
టాస్ లక్నో జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. జీటీ తరఫున ఓపెనింగ్ చేసిన సాహా, శుభ్మన్.. వచ్చి రావడంతోనే పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. తొలుత సాహా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా షాట్లతో బౌండరీల మోత మోగించేశాడు. దీంతో.. అతడు 20 బంతుల్లోనే అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం శుభ్మన్ గిల్ తన దూకుడు పెంచాడు. అప్పటిదాకా నిదానంగా ఆడిన అతగాడు.. సాహా హాఫ్ సెంచరీ చేశాక తన ఖాతా తెరిచాడు. భారీ షాట్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇలా వీళ్లిద్దరు విలయతాండవం చేయడంతో.. గుజరాత్ స్కోరు బుల్లెట్ ట్రైన్‌లా పరుగులు తీసింది. వీళ్లిద్దరు 12 ఓవర్లలోనే తొలి వికెట్‌కి 142 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Rohit Sharma: ‘రోహిత్’ కాదు.. ‘నోహిట్’ శర్మగా పేరు మార్చుకో..
సాహా ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన పాండ్యా కూడా.. వచ్చి రావడంతోనే మెరుపులు మెరిపించాడు. తొలి రెండు బంతులకు కన్ఫ్యూజ్ అయిన అతగాడు.. ఆ తర్వాత కుదురుకొని రప్ఫాడించాడు. 15 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు. నిజానికి.. అవేశ్ బౌలింగ్‌లో రెండో బంతికే హార్దిక్ ఔట్ అవ్వాల్సింది. అవేశ్ వేసిన బంతిని ఎలా ఆడాలో తెలీక లెగ్ సైడ్ ఆడబోతే, అతని హార్దిక్ ప్యాడ్‌కి తగిలి నేరుగా వికెట్లను తాకింది. అయితే.. బెయిల్స్ పడకపోవడంతో హార్దిక్ బ్రతికిపోయాడు. అయితే.. కాసేపటికే అతడు తన బ్రదర్ కృనాల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం వచ్చిన మిల్లర్ సైతం 21 పరుగులు చేసి, తనవంతు జట్టుకి సహకారం అందించాడు. శుభ్మన్ సెంచరీ చేస్తాడని భావిస్తే, అతడు 94 పరుగులతోనే సర్దుబాటు చేసుకున్నాడు.
