Site icon NTV Telugu

CSK vs GT: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్..

Csk Vs Gt

Csk Vs Gt

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి మంచి ఊపు మీదున్నాయి. ఇదిలా ఉంటే.. గత సీజన్ లో చెన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ పోరు జరిగింది. ఆ మ్యాచ్ లో చెన్నై ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో.. ఎలాగైనా ఈరోజు జరిగే మ్యాచ్ లో ఆ ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు.. మంచి ఫామ్ లో ఉన్న చెన్నై టీమ్.. ఆ ఛాన్స్ ఇచ్చేది లేదని అంటుంది.

చెన్నై ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, రహానే, డారిల్ మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, పతిరణ, ముస్తాఫిజుర్, తుషార్ దేశ్ పాండే.

గుజరాత్ ప్లేయింగ్ ఎలెవన్:
శుభ్ మాన్ గిల్ (కెప్టెన్), సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్.

Exit mobile version