ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68) చెలరేగి ఆడటంతో.. రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
Read Also: Ambati Rayudu: పవన్ కళ్యాణ్ను సీఎం చేయడానికి సిద్ధం..!
ఒకానొక సమయంలో 50 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో 68 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 2 సిక్స్ లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత మరో బ్యాటర్ రియాన్ పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 5 సిక్స్ లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య 130 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (24) పరుగులు చేశాడు. బట్లర్ (8), హెట్మేయర్ (13) పరుగులు చేశాడు.
Read Also: Maharashtra Crime: ప్రియుడు కోసం ఇద్దరు పిల్లలను చంపిన తల్లి..
గుజరాత్ బౌలింగ్ లో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. రాజస్థాన్ బ్యాటర్ల వికెట్లు తీయడంలో గుజరాత్ బౌలర్లు చెమటోడ్చినప్పటికీ సాధ్యపడలేదు. ముందుగా 2 వికెట్లు తొందర్లోనే పడగొట్టినప్పటికీ.. శాంసన్, పరాగ్ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు.
