Site icon NTV Telugu

LSG vs GT: గుజరాత్ టార్గెట్ 164 పరుగులు.. కట్టడి చేసిన బౌలర్స్

Lsg

Lsg

ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 164 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచింది. కాగా.. గుజరాత్ బౌలర్లు బ్యాటర్లను కట్టడి చేయడంతో పరుగులు ఎక్కువ చేయకుండ ఆపారు. ఇదిలా ఉంటే.. లక్నో బ్యాటింగ్ లో మార్కస్ స్టోయినీస్ అత్యధికంగా (58) పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (33), చివరలో నికోలస్ పూరన్ (32) పరుగులు చేశారు. కాగా.. ఈ మ్యాచ్ లో కూడా డికాక్ మరోసారి నిరాశపరిచాడు. 6 పరుగులు చేసి ఔటయ్యాడు.

Read Also: Romario Shepherd: విద్వంసం సృష్టించిన ముంబై బ్యాటర్.. ఓకే ఓవర్‌లో 32 పరుగులు..!

లక్నో బ్యాటర్లలో పడిక్కల్ (7), ఆయూష్ బదోని (20), కృనాల్ పాండ్యా (2) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్, దర్శన్ నాల్కండే తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Read Also: Chittoor Crime: మైనర్‌పై అత్యాచారం.. అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

Exit mobile version