NTV Telugu Site icon

MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీ చెలరేగడానికి కారణం అదే: గౌతమ్ గంభీర్

Ms Dhoni Batting

Ms Dhoni Batting

Gautam Gambhir explains CSK Strategy in IPL 2024: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరిస్తున్నాడు. ఇన్నింగ్స్ చివర్లలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక పరుగులు చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సులు బాదుతూ మ్యాచ్‌ను మలుపు తిప్పేస్తున్నాడు. ధోనీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 110 సగటు, 229.16 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో బెస్ట్ బ్యాటింగ్ ఏవరేజ్ ఉన్న బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. అత్యుత్తమ బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ధోనీ చెలరేగడానికి కారణం ఏంటో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

Also Read: SHR vs RR: సన్‌రైజర్స్‌ ప్లేయర్లకు చేదు అనుభవం.. స్టార్ ఆటగాడిని తోసేసిన ఫాన్స్!

చెన్నై సూపర్ కింగ్స్ వ్యూహాలతో ఎంఎస్ ధోనీకి స్వేచ్ఛ వచ్చిందని గౌతమ్ గంభీర్ తెలిపాడు. స్పోర్ట్స్ కీదాతో గంభీర్ మాట్లాడుతూ… ‘ఎంఎస్ ధోనీ కేవలం 8-10 బంతులు ఎదుర్కోవడం చెన్నై వ్యూహం. ధోనీకి మేనేజ్మెంట్ స్వేచ్ఛను ఇచ్చింది. వేర్వేరు జట్లకు వేర్వేరు వ్యూహాలు ఉంటాయి. చెన్నై ఈ వ్యూహాన్ని గత 2-3 ఏళ్లుగా అమలు చేస్తోంది. ఇదే ధోనీ చెలరేగడానికి కారణం. మీరు 20-25 బంతులు ఆడితే.. బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది. అదే 8-10 బంతులు మాత్రమే ఆడితే స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయొచ్చు’ అని విశ్లేషించాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారిగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔట్ అయ్యాడు. 11 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 14 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.

Show comments