Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేకేఆర్ విజయం
- మెరుపు శతకం చేసిన ఫిన్ అలెన్
- కేకేఆర్ స్టార్ అలెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వరుస విజయాలు అందుకుంటోంది. శుక్రవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా డీసీ 8 వికెట్లకు 142 పరుగులే చేయగా.. లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా విజయంలో న్యూజీలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సులతో 100 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. మెరుపు శతకం చేసిన ఫిన్ అలెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను ఇప్పుడు ‘ఫిన్ అలెన్ 2.0’లా మారేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. కేవలం దూకుడుగా ఆడటమే కాకుండా.. పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడం నేర్చుకుంటున్నానని వెల్లడించాడు.
‘నా ఆట చూస్తే ఫిన్ అలెన్ 2.0లా అనిపిస్తుంది. నేను నా ఆటలో మరిన్ని కోణాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. ఛేదనలో మా జట్టు తొందరగానే రెండు వికెట్లు కోల్పోయింది. అందుకే కొంచెం బాధ్యత తీసుకుని జట్టుకు విజయాన్ని అందించాలనుకున్నా. నేను ఇదివరకు చెప్పినట్టే.. ఇన్నింగ్స్ ప్రారంభంలో కాస్త ఓపికగా ఆడాలని అనుకున్నాను. మొదట్లో బ్యాటింగ్ అంత సులభంగా లేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. మమ్మల్ని అతడు కట్టడి చేశాడు. అందుకే ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని చూసాను. నా బ్యాటింగ్‌లో మార్పులు తీసుకురావాలనుకుంటున్నా. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే క్రీజులో నిలబడాలి. షేన్ వాట్సన్, అభిషేక్ నాయర్లతో కలిసి దీనిపై పని చేస్తున్నాను’ అని ఫిన్ అలెన్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘నాకు నేను అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాను. కొన్ని మంచి స్టార్ట్స్ వచ్చినా పెద్ద ఇన్నింగ్స్‌లుగా మార్చుకోలేకపోవడం నిరాశ కలిగించింది. కానీ ఈరోజు వ్యక్తిగతంగా మంచి విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నా సహజమైన ఆట గురించి మర్చిపోయి మ్యాచ్ పరిస్థితికి తగ్గట్టే ఆడాలి. నేను ఎక్కువసేపు క్రీజులో ఉంటే తర్వాత పరిస్థితిని మార్చగలనని నమ్మకం ఉంది. కనీసం 40 బంతులు ఆడాలని లక్ష్యంగా పెట్టుకుంటాను. అది ప్రతిసారి సాధ్యం కాదు. కానీ ఈరోజు ఆ ఆలోచన నన్ను ముందుకు నడిపించింది. జట్టులో చోటు కోల్పోయి మళ్లీ తిరిగి రావడం బాగుంది. కొన్నిసార్లు జట్టుకు దూరంగా ఉండటం మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. మానసికంగా కాస్త ఫ్రెష్ అవ్వడానికి సమయం దొరుకుతుంది. నిజం చెప్పాలంటే ఈ సీజన్ ప్రారంభంలో నాపై నేనే చాలా ఒత్తిడి పెట్టుకున్నాను. కాబట్టి కొంత విరామం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించి మళ్లీ తిరిగి రావడం చాలా బాగుంది’ అని ఫిన్ అలెన్ తెలిపాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!