Site icon NTV Telugu

MI vs DC: ఢిల్లీ ముందు భారీ లక్ష్యం.. చితక్కొట్టిన ముంబై బ్యాటర్లు

Mi

Mi

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబుల్ డెక్కర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై.. ఢిల్లీ ముందు 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (49), ఇషాన్ కిషన్ (42) పరుగులతో రాణించారు.

Read Also: Tragedy: విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

కాగా.. ఈ మ్యాచ్ తోనే ఎంట్రీ ఇచ్చిన మిస్టర్ 360.. సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ హార్థిక్ పాండ్యా (39) పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ (45) పరుగులు చేశాడు. చివరలో షెఫర్డ్ కేవలం 10 బంతుల్లేనే (39) పరుగులు చేయడంతో ముంబై స్కోరు భారీ దిశగా వెళ్లింది. ఢిల్లీ బౌలింగ్ లో.. అక్షర్ పటేల్, అన్రిచ్ నోర్ట్జే తలో రెండు వికెట్లు తీశారు. ఖలీల్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.

Read Also: Fire Accident: మెక్సికోలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

Exit mobile version