Site icon NTV Telugu

RCB vs DC: ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యం.. ఆర్సీబీ స్కోరు 187

Rcb Batting

Rcb Batting

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు.

Jharkhand: భారీగా నోట్ల కట్టలు బయటపడిన కేసులో మంత్రికి ఈడీ సమన్లు

ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు.. విరాట్ కోహ్లీ (27), డుప్లెసిస్ (6) చేశారు. మహిపాల్ లోమ్రోర్ (13), దినేష్ కార్తీక్, స్వప్నిల్ సింగ్ డకౌట్తో నిరాశపరిచారు. ఆ తరవాత కర్ణ్ శర్మ (6) పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలింగ్ లో ఖలీల్ అహ్మద్, రశీక్ సలాం తలో 2 వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది.

Janhvi Kapoor: మరో క్రేజీ శారీలో జాన్వీ కపూర్.. అందరి కళ్లు బ్లౌజ్‌పైనే!

Exit mobile version