Site icon NTV Telugu

DC vs GT: పేకమేడలా కూలుతున్న డీసీ.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Dc 10 Overs Score

Dc 10 Overs Score

Delhi Capitals Scored 54 In First 10 Overs With 5 Wickets Loss: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న డీసీ జట్టు.. పేకమేడలా కుప్పకూలుతోంది. తొలి 10 ఓవర్లలో ఏకంగా 5 వికెట్లు కోల్పోయి, కేవలం 54 పరుగులు చేసింది. విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ తొలి బంతికే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆఫ్ సైడ్ వైపు కాస్త టెంప్టింగ్ బంతి వేయగా.. అతడు గట్టిగా కొట్టాడు. అయితే.. అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లిపోయింది. అలా తొలి వికెడ్ పడగానే డీసీపై ఒత్తిడి పెరిగింది. ఆ వెంటనే ఢిల్లీ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. రన్ తీయడానికి వీలు లేకపోయినా.. వార్నర్ రన్ తీసేందుకు ప్రయత్నించాడు. ప్రియమ్ గార్గ్ అతనికి వార్నింగ్ ఇవ్వకపోవడంతో.. వార్నర్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. కేవలం ఒక్క పరుగు కోసం ఢిల్లీ జట్టు ఇక్కడ అత్యంత విలువైన వికెట్ (వార్నర్)ని కోల్పోవాల్సి వచ్చింది.

Khammam Crime: ఖమ్మంలో దారుణం.. చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

పోనీ.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లైనా నిదానంగా ఆడుతూ, వికెట్లను కాపాడుకోగలిగారా? అంటే అదీ లేదు. క్రీజులోకి వచ్చిన వాళ్లు.. ఇలా వచ్చి, అలా క్యాచ్‌లు అందిస్తూ పెవిలియన్ బాట పట్టారు. మనీష్ పాండే ఎప్పట్లాగే ఈ మ్యాచ్‌లోనూ ఉసూరుమనిపించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడి, తనని తాను నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినా.. సద్వినియోగపరచుకోలేకపోయాడు. షమీ బౌలింగ్‌లో కీపర్‌గా క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ కొద్దిసేపటికే.. వార్నర్ రనౌట్‌కి కారకుడైన ప్రియమ్ గార్గ్ సైతం కీపర్ చేతికి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు. ఇలా వరుసగా వికెట్లు కోల్పోవడంతో.. 5 ఓవర్లలో డీసీ స్కోరు 23/5గా నమోదైంది. ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్, అమర్ హకీమ్ ఖాన్ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా పరుగులు చేస్తూ.. తమ జట్టుని ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి ఆటతీరు పుణ్యమా అని.. డీసీ స్కోరు తొలి పది ఓవర్లలో 54 వరకు చేరింది. మరి.. వీరి పోరాటం ఎక్కడిదాకా సాగుతుందో చూడాలి.

Prabhas: ఆ ఒక్క పని చేసుంటే దీన్ని మించిన సినిమా వచ్చేది కాదేమో

Exit mobile version