Yuzvendra Chahal Record in T20s: రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 350 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చహల్ ఈ ఘనత సాధించాడు. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఔట్ చేసి.. టీ20 క్రికెట్‌లో 350 వికెట్ల మైలురాయిని యూజీ అందుకున్నాడు. 301 మ్యాచ్‌లలో చాహల్ ఈ ఫీట్ సాధించాడు. 310 వికెట్లతో ముంబై ఇండియన్స్ బౌలర్ పీయూష్ చావ్లా రెండో స్థానంలో నిలిచాడు.
టీ20 క్రికెట్‌లో ఓవరాల్‌గా 350 వికెట్ల ఘనతను అందుకున్న 11వ బౌలర్‌గా యుజ్వేంద్ర చహల్ నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు. బ్రావో 574 మ్యాచ్‌లలో 625 వికెట్స్ పడగొట్టాడు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్, ఇమ్రాన్ తాహీర్, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, వహాబ్ రియాజ్, లసిత్ మలింగ, సోహైల్ తన్వీర్, క్రిస్ జోర్డాన్ ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ మానవ అక్రమ రవాణా కేసులో నలుగురు వ్యక్తుల అరెస్ట్
యుజ్వేంద్ర చహల్ 350 వికెట్లలో భారత్ తరఫున 96 వికెట్స్ పడగొట్టాడు. యూజీ తన ఐపీఎల్ కెరీర్‌లో 201 వికెట్లు సాధించాడు. తన లెగ్ స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే చహల్.. టీ20 మ్యాచ్‌లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ 2024కు కూడా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది.