NTV Telugu Site icon

Parth Jindal Angry: కోపంతో ఊగిపోయిన ఢిల్లీ ఓనర్ పార్త్ జిందాల్.. వీడియో వైరల్!

Parth Jindal Angry

Parth Jindal Angry

Delhi Capitals Owner Parth Jindal Angry on Sanju Samson Dismissal: ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌ అవుట్ అయిన తీరు వివాదాస్పదంగా మారింది. 222 పరుగుల చేధన‌లో ముఖేష్ కుమార్ వేసిన 16వ ఓవర్‌లోని నాలుగో బంతికి సంజూ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్‌ వద్ద షై హోప్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో హోప్ బౌండరీ లైన్‌కు తాకినట్లు రీప్లేలో అనిపించింది. దీనిపై సంజూ ఫీల్డ్ అంపైర్‌‌తో వాగ్వాదానికి దిగాడు. క్రీజ్‌ను వీడేందుకు నిరాకరించాడు.

సంజూ శాంసన్‌ అవుట్‌పై రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్త్ జిందాల్ కోపంతో ఊగిపోయారు. సంజూ శాంసన్‌ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన సమయంలో స్టాండ్స్‌లో ఉన్న పార్త్ జిందాల్ సహనం కోల్పోయారు. అది అవుట్, అవుట్ అంటూ గట్టిగా అరిచారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిందాల్‌పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌ అత్యంత చికాకు కలిగించే ఫ్రాంచైజీ యజమాని పార్త్ జిందాల్ అని ట్వీట్స్ చేస్తున్నారు. ‘ఐపీఎల్ 2024 నుంచి బెంగళూరు దాదాపుగా నిష్క్రమించింది. కానీ మే 12న ఢిల్లీని, 18న చెన్నైని ఇంటికి పంపిస్తుంది’ అని ఒకరు కామెంట్ చేశారు.

Also Read: Sanju Samson Out: అంపైర్‌తో గొడవ.. క్రీజ్‌ను వీడేందుకు ససేమిరా అన్న సంజూ శాంసన్!

ఐపీఎల్ 2024లో మొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండు గేమ్‌లను ఓడిపోయింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. 8 విజయాలతో 16 పాయింట్స్ ఖాతాలో వేసుకుని దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో ఇంకో విజయం సాధిస్తే.. అధికారిక ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేసులో ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.