NTV Telugu Site icon

Hardik Pandya: టాస్‌ విషయంలో విమర్శలు.. స్పందించిన హార్దిక్ పాండ్యా!

Hardik Pandya

Hardik Pandya

ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడంపై విమర్శలు వచ్చాయి. మధ్యాహ్నం వేళ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, హార్దిక్‌ నిర్ణయం సరైంది కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవాల్సింది అని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలు ముంబై కెప్టెన్ హార్దిక్ స్పందించాడు.

‘భారీ ఛేదనలో విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోయాం. టోర్నీలో ఇప్పుడు ప్రతి బంతీ కీలకంగా మారింది. గతంలో రెండు ఓవర్లలో ఫలితం తారుమారెయ్యేది. ఇప్పుడు అది రెండు బంతులుగా మారింది. బౌలర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఓడినా మా ఆటతీరు బాగుంది. మిడిల్‌ ఓవర్లలో ఇంకాస్త దూకుడుగా ఆడి ఉంటే గెలిచేందుకు అవకాశాలు ఉండేవి. ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్ ఆడిన విధానం అద్భుతం. రిస్క్‌ తీసుకొని ఆడినట్లు అనిపించింది. యువ క్రికెటర్లలో ఎలాంటి భయం లేదని అతడు మరోసారి నిరూపించాడు’ అని హార్దిక్ పాండ్యా అన్నాడు.

Also Read: Rohit Sharma: ఐపీఎల్‌లో రోహిత్ శర్మ చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు!

‘మేం తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడానికిగల కారణాలను చాలా మంది అన్వేషిస్తున్నారు. ఇలాంటి పిచ్‌పై మేం ఎంత భారీ టార్గెట్‌ను ఛేదించగలమో తెలుసుకొనేందుకు ఓ పరీక్ష పెట్టుకున్నాం. ఒక్కోసారి ప్రణాళికలు సక్సెస్ కావు. టాస్‌ విషయంలో మరోలా చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించలేదు’ అని హార్దిక్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 3 విజయాలతో పట్టికలో 9వ స్థానంలో ఉంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లలో గెలిస్తేనే ముంబై ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఒక్కటి ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.

Show comments