NTV Telugu Site icon

David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత.. రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు

David Waner Record

David Waner Record

David Warners Creates New Record In IPL: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనత సాధించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన వార్నర్ (41 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో 57 పరుగులు).. ఈ సందర్భంగానే ఆ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటివరకు కేకేఆర్‌పై 26 మ్యాచ్‌లు ఆడిన అతగాడు.. 146 సగటుతో 1042 పరుగులు చేశాడు. అంతకుముందు.. 1040 పరుగులతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండేవాడు. ఇప్పుడు రెండు పరుగుల తేడాతో రోహిత్‌ రికార్డును వార్నర్‌ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత శిఖర్ ధావన్ 850 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.

Sai Dharam Tej: రెండేళ్లు అనుభవించిన నరకానికి దక్కిన ఫలితం.. ఈ విజయం

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 127 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో.. కేకేఆర్ జట్టు పేకమేడల్లా కుప్పకూలింది. జేసన్ రాయ్ (43), ఆండ్రూ రసెల్ (38) పుణ్యమా అని.. కేకేఆర్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇక 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీసీ జట్టు.. 19.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసి గెలుపొందింది. డేవిడ్ వార్నర్ అర్థశతకంతో చెలరేగగా.. మనీష్ పాండే (23), అక్షర్ పటేల్ (19) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో డీసీ విజయతీరాలకు చేరింది. నిజానికి.. మొదట్లో డీసీ దూకుడుగా ఆడటం చూసి, ఈ మ్యాచ్‌ని డీసీ త్వరగా ముగించేస్తుందని అంతా భావించారు. కానీ.. కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో, ఈ మ్యాచ్ చివరివరకు ఉత్కంఠభరితంగా సాగింది.

Karumuri Nageswara Rao: రాజధాని వైజాగే.. అక్కడి నుండే పాలన..

Show comments