MS Dhoni Retirement: ఆ తర్వాతే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni Retirement: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడి.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. బెంగళూరుతో జరిగిన మ్యాచే చివరిదని, ధోనీని మళ్లీ మైదానంలో చూడలేమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ వార్త బయటికొచ్చింది. తొడ కండర గాయంతో బాధపడుతున్న ధోనీ.. శస్త్రచికిత్స కోసం త్వరలో లండన్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
తొడ కండర గాయం నుంచి కోలుకున్న తర్వాత ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్పై ఓ నిర్ణయం తీసుకుంటాడని సీఎస్కే వర్గాలు పేర్కొన్నాయి. ‘ఐపీఎల్ 2024 మొత్తం ఎంఎస్ ధోనీ తొడ కండర గాయంతో ఇబ్బందిపడ్డాడు. ఈ గాయానికి శస్త్రచికిత్స కోసం మహీ లండన్ వెళ్లొచ్చు. ప్రస్తుతం అతడు పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడు. కానీ క్రికెట్ ఆడటం కొనసాగించాలనుకుంటున్నాడు. శస్త్రచికిత్స తర్వాతే ధోనీ తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటాడు. చికిత్స అనంతరం కోలుకోవడానికి 5-6 నెలలు పడుతుంది’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి.
Also Read
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
Also Read: KKR vs SRH Qualifier 1: కోల్‌కతా, హైదరాబాద్ క్వాలిఫయర్-1.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు నుంచే ఎంఎస్ ధోనీ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్ కీపర్ డేవిడ్ కాన్వే కూడా గాయం బారిన పడటంతో ధోనీ కీపర్‌గా మైదానంలోకి దిగక తప్పలేదు. గాయానికి మందులు వాడుతుండడంతోనే వీలైనంత తక్కువ పరిగెత్తేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిజానికి డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని సూచించినా.. జట్టులోని కీలక ఆటగాళ్లు గాయాలతో వైదొలగడంతో ఆడక తప్పలేదు. గత ఐపీఎల్లో మోకాలి గాయంతోనే ఆడిన ధోనీ.. జట్టుకు టైటిల్ అందించాడు. మోకాలి గాయం పూర్తిగా నయమైనా.. కండర గాయం మాత్రం ఇబ్బంది పెడుతోంది. ఐపీఎల్ 2024లో మహీ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!