NTV Telugu Site icon

SRH vs CSK: చెన్నై విజయం.. విఫలమైన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు

Csk Won

Csk Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. 78 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో సీఎస్కే విజయాన్ని నమోదు చేసింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. దీంతో.. ఈ మ్యాచ్ లో ఓటమితో సన్ రైజర్స్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు రాణించలేకపోయారు. ట్రేవిస్ హెడ్ (13), అభిషేక్ శర్మ (15) పరుగులతో నిరాశ పరిచారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అన్మోల్ ప్రీత్ సింగ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మార్క్రమ్ (32) కాస్త పర్వాలేదనిపించాడు. కానీ.. పతిరణ వేసిన బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి (15) పెద్దగా ఆకట్టులేకపోయాడు. క్లాసెన్ (20), సమద్ (19), షాబాజ్ అహ్మద్ (7), ప్యాట్ కమిన్స్ (5), భువనేశ్వర్ (4) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే కీలకమైన 4 వికెట్లు తీసి.. జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ముస్తాఫిజుర్, పతిరన తలో రెండు వికెట్లు పడగొట్టారు. జడేజా, శార్ధూల్ ఠాకూర్ కు తలో వికెట్ దక్కింది.

Janasena: జనసేనకు గ్లాసు గుర్తునే కామన్‌ సింబల్‌గా కేటాయించిన ఈసీ

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గైక్వాడ్ ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. అతనికి తోడు శివం దూబే (39*) పరుగులతో చెలరేగాడు. చెన్నై బ్యాటింగ్ లో అజింక్యా రహానే (9) పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గైక్వాడ్ (98), మిచెల్ (52) పరుగులతో అదరగొట్టారు. రుతురాజ్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండో వికెట్‌కు 107 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గైక్వాడ్ ఈ సీజన్‌లో తన మూడో అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శివం దూబే (39) బౌలర్లపై దండయాత్ర చేశారు. చివర్లో ధోనీ (5) పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. కమిన్స్, షాబాజ్ అహ్మద్ వికెట్ సాధించలేకపోయారు.

CM Revanth: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే.. సీఎం కీలక వ్యాఖ్యలు