Site icon NTV Telugu

CSK vs PBKS: పంజాబ్ పై చెన్నై ఘన విజయం..

Csk Won

Csk Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టును.. 139 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. పంజాబ్ బ్యాటింగ్ లో ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఒక్కడే అత్యధికంగా (30) పరుగులు చేశాడు. ఆ తర్వాత బెయిర్ స్టో (7), రోసో డకౌట్ అయ్యాడు. శశాంక్ సింగ్ (27), సామ్ కరన్ (7), జితేష్ శర్మ డకౌట్, అశుతోష్ శర్మ (3), హర్ ప్రీత్ బ్రార్ (17), హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16), రబాడా (11) పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ లో రవీంద్ర జడేబా 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే, సిమర్ జిత్ సింగ్ తలో 2 వికెట్లు సాధించారు. శార్ధూల్ ఠాకూర్, సాంథ్నర్ కు తలో వికెట్ దక్కింది.

Devendra Fadnavis: కసబ్ గురించి కాంగ్రెస్ ఆందోళన.. 26/11 దాడులపై రాజకీయం..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్..167 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన అజింక్యా రహానే (9), రుతురాజ్ గైక్వాడ్ (32) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ (30) రన్స్ చేశాడు. మొయిన్ అలీ (17), అత్యధికంగా రవీంద్ర జడేజా (43) పరుగులు చేశాడు. ఆ తర్వాత మిచెల్ సాంథ్నర్ (11), శార్దూల్ ఠాకూర్ (17), ధోనీ గోల్డెన్ డకౌటయ్యాడు. పంజాబ్ బౌలింగ్ లో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, సామ్ కరన్ ఒక వికెట్ తీశాడు.

Ambati Rambabu: కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదు

Exit mobile version