Site icon NTV Telugu

RR vs CSK: తక్కువ స్కోరుకే కట్టడి చేసిన సీఎస్కే.. ఆర్ఆర్ స్కోరు ఎంతంటే..?

Rr Vs Csk

Rr Vs Csk

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబల్ డెక్రర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. చెన్నైతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది రాజస్థాన్. పరుగులు సాధించడంలో రాజస్థాన్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. చెన్నై బౌలర్లు రన్స్ చేయకుండా కట్టడి చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ (47*) అత్యధికంగా పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు.

Krishna District Collector: ప్రజాస్వామ్య పండుగ అందరూ వచ్చి ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి

మొదట్లో ఓపెనర్లు బాగానే ఆడినప్పటికీ.. ఆశించిన పరుగులు చేయలేకపోయారు. నిదానంగా ఆడుతూ.. స్కోరు బోర్డును కదిలించలేకపోయారు. యశస్వీ జైస్వాల్ (24), బట్లర్ (21) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత కెప్టెన్ శాంసన్ (15) కూడా అదే ఆటతీరు కనబరిచాడు. రియాన్ పరాగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచాడు. పరాగ్ కు తోడు ధ్రువ్ జురేల్ (28) మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. తక్కువ స్కోరుకు కట్టడి చేశారు. ముఖ్యంగా సిమర్ జీత్ సింగ్ 3 కీలకమైన వికెట్లు తీసి ఆర్ఆర్ ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు తీశాడు.

PoK: ఆక్రమిత కాశ్మీర్‌పై పాకిస్తాన్ పట్టుకోల్పోతోందా..? భారత జెండాలు, ఆజాదీ నినాదాలతో ప్రజా ఉద్యమం..

Exit mobile version