Bhuvneshwar Kumar: మేము కాదు, వాళ్లే అసలు హీరోలు.. భువీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ
- ఆర్సీబీ సక్సెస్‌లో స్వింగ్ కింగ్ భువీ కీలక పాత్ర
- మేము కాదు, వాళ్లే అసలు హీరోలు అంటున్న భువనేశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar on RCB Win vs GT in IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌ను ఆర్సీబీ చిత్తు చేసింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అదరగొట్టిన బెంగళూరు 92 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ జట్టుకు బలంగా మారారు. టైటాన్స్‌పై ఘన విజయం అనంతరం మాట్లాడిన భువీ.. జట్టు విజయానికి వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. తమ సక్సెస్‌లో సపోర్ట్ స్టాఫ్ పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నాడు.
‘మా విజయం క్రెడిట్ సపోర్ట్ స్టాఫ్‌కే దక్కాలి. తెరవెనుక వారు ఎంతో కష్టపడుతున్నారు. నిజమే.. నేను, హేజిల్‌వుడ్ జట్టులో అనుభవజ్ఞులం. కానీ సపోర్ట్ స్టాఫ్ మాకు చెబుతున్న చిన్న చిన్న విషయాలే చాలా పెద్ద మార్పు తీసుకొస్తున్నాయి. కొన్నిసార్లు ఆ చిన్న విషయాలను మనం పట్టించుకోకపోవచ్చు. కానీ సీనియర్ ఆటగాళ్లు వాటిని అమలు చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. మేము మొదటి మ్యాచ్ నుంచే అదే చేస్తున్నాం. అది మాకు చాలా ఉపయోగపడుతోంది’ అని స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ చెప్పాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆర్సీబీ జట్టు ఎక్కువగా డేటాపైనే ఆధారపడుతుందా? అనే ప్రశ్నకు కూడా భువీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘మేము పూర్తిగా డేటాపై ఆధారపడము. కానీ డేటా ద్వారా వచ్చే సమాచారాన్ని గౌరవిస్తాం. ప్రత్యర్థి ఆటగాళ్లు కొత్తగా ఏమైనా ప్రయత్నిస్తే.. వాటిని గమనించి మేము కూడా మా ప్రణాళికలను మార్చుకుంటాం. డేటా మాకు సహాయపడుతుంది కానీ.. అది ఒక్కటే హెల్ప్ చేయదు. అనుభవం, పరిస్థితులు, మ్యాచ్ అవగాహన కూడా చాలా ముఖ్యం. ఈ పిచ్‌లో షార్ట్ బాల్ లేదా ఫుల్ లెంగ్త్ బంతి వేసినా బౌండరీకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. అందుకే మేము బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ చేయాలని ప్లాన్ చేశాం. ముఖ్యంగా ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ అయ్యేలా స్టంప్స్‌ను టార్గెట్ చేశాం. అదే మా ప్రధాన వ్యూహం’ అని వివరించాడు.
ఈ సీజన్లో భువనేశ్వర్ కుమార్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 15 మ్యాచ్‌లలో 26 వికెట్లు పడగొట్టాడు. అతడి అసాధారణ ప్రదర్శనలు ప్రతిష్టాత్మకమైన పర్పుల్ క్యాప్‌ను అందించాయి. జోష్ హేజిల్‌వుడ్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లకు పెద్ద సవాల్‌గా మారాడు. అతడి స్వింగ్ బౌలింగ్ ముందు ప్రత్యర్థి బ్యాటర్లు తేలిపోతున్నారు. క్వాలిఫయర్-1లో జాకబ్ డఫీ మొదటి ఓవర్ వేయగా.. సాయి సుదర్శన్ బౌండరీలతో రెచ్చిపోయాడు. భువీ మాత్రం అద్భుత బంతులతో రెండో ఓవర్లో పరుగులను కట్టడి చేశాడు. గిల్, తేవాతియాలను పెవిలియన్ చేర్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. గతేడాది కూడా ఈ స్వింగ్ కింగ్ 14 మ్యాచ్‌లలో 17 వికెట్లు తీశాడు. ఫైనల్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!