Site icon NTV Telugu

IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్.. త్వరలో ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్!

Ipl

Ipl

IPL 2025: భారత్- పాక్ మధ్య యుద్ధంతో ఐపీఎల్‌కు తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను ముగించాలని గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆలోచనలో ఉంది. ఈ వారాంతంలో టోర్నమెంట్ మళ్లీ స్టార్ట్ కావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే 15వ తేదీ నుంచే మ్యాచ్‌లు జరిగే ఛాన్స్ ఉంది. అసలు షెడ్యూల్‌ ప్రకారం మే 25లోపే లీగ్‌ను ముగించాలని బీసీసీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. ఇక, ఐపీఎల్‌ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా తెలియజేశారు.

Read Also: Trisha : త్రిష‌కు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..

ఇక, ఐపీఎల్‌–2025 లీగ్‌ దశలో మొత్తం 57 మ్యాచ్‌లు కంప్లీట్ అయ్యాయి. ధర్మశాల వేదికగా పంజాబ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న 58వ మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేసింది.. దీంతో ఈ మ్యాచ్ ను మళ్లీ నిర్వహించాలా లేదంటే ఇరు జట్లకు చెరో పాయింట్‌ కేటాయించాలా అనే దానిపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లీగ్‌ దశలో మరో 12 మ్యాచ్‌లతో పాటు 4 ప్లే ఆఫ్స్‌ కలిపి మొత్తం 16 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ముందు అనుకున్నట్లుగానే.. దక్షిణాదిలో సురక్షితమైన స్టేడియాల్లో మ్యాచ్‌లు జరపాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను సెలక్ట్ చేశారు.

Read Also: Indira Gandhi 1971 Decision: పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెట్టింట 1971లో ఇందిరా గాంధీ నిర్ణయంపై చర్చ

అయితే, షెడ్యూల్‌ ప్రకారం హైదరాబాద్‌లో ఎలాగూ రెండు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వీటీతో పాటు ఈ మూడు స్టేడియాల్లో మిగతా మ్యాచ్ లు జరిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే స్వదేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లను తిరిగి భారత్ కు రప్పించడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు, నిర్వాహకులకు పెద్ద సమస్యగా మారింది. కాగా, ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ప్లేయర్స్ ను, ఇతర సిబ్బందిని వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సమాచారం అందజేసింది.

Exit mobile version