Site icon NTV Telugu

RCB vs PBKS: బెంగళూరు టార్గెట్ 177 పరుగులు.. చివరలో చితకబాదిన శశాంక్

Pbks

Pbks

ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్-రాయల్స్ ఛాలెంజర్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఆర్సీబీ లక్ష్యం 177 పరుగులు చేయాల్సి ఉంది. పంజాబ్ బ్యాటింగ్ లో శిఖర్ ధావన్ (45) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో (8) అనుకున్నంత రాణించలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ (25), లివింగ్ స్టోన్ (17) పరుగులు చేశారు.

Read Also: London: యాక్సిడెంట్‌లో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి మృతి

అనంతరం బ్యాటింగ్ కు దిగిన సామ్ కరన్ (23), జితేష్ శర్మ (27) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. చివరలో శశాంక్ సింగ్ కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేసి పంజాబ్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. హర్ప్రీత్ బార్ (2) పరుగులు చేయడంతో పంజాబ్ 176 పరుగులు చేసింది. ఇక.. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, మ్యాక్స్ వెల్ తలో రెండు వికెట్లు తీశారు. ఆ తర్వాత యశ్ దయాల్, ఆల్జరీ జోసఫ్ చెరో వికెట్ సంపాదించారు.

Read Also: Kangana Ranaut: కంగనాపై హిమాచల్ కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు

Exit mobile version