Site icon NTV Telugu

Anshul Kamboj-CSK: అన్షుల్‌ అదరహో.. సీఎస్‌కేకు బిగ్ మ్యాచ్ విన్నర్‌గా యువ సంచలనం!

Anshul Kamboj CSK

Anshul Kamboj CSK

Anshul Kamboj shines as CSK’s key bowler in IPL 2026: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) హ్యాట్రిక్‌ ఓటములను ఎదుర్కొంది. ఈ సీజన్‌ను పేలవంగా ఆరంభించిన సీఎస్‌కే.. కాస్త ఆలస్యంగా అయినా జోరందుకుంది. వరుసగా రెండు అద్భుత విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. చెన్నై విజయాల్లో యువ పేసర్ అన్షుల్‌ కాంబోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలక బౌలర్‌గా మారుతున్నాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అన్షుల్‌ రూపంలో చెన్నై బౌలింగ్ దళానికి కొత్త బలం వచ్చింది.

ఐపీఎల్‌లో పవర్‌ప్లేలో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడం బౌలర్లకు చాలా కష్టం. అయితే అన్షుల్ కాంబోజ్ తన కట్టుదిట్టమైన లైన్-లెంగ్త్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తూ కీలక వికెట్లు తీస్తున్నాడు. ఆరంభంలోనే బ్రేక్‌ త్రూ ఇస్తూ జట్టుకు మంచి ఆరంభం అందిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో కూడా ప్రభావం చుపుతున్నాడు. బ్యాటర్లు క్రీజులో సెట్ అవుతున్న సమయంలో కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెడుతున్నాడు. వేరియేషన్స్, వేగంలో మార్పులు బ్యాటర్లకు సవాల్‌గా మారుతున్నాయి. డెత్ ఓవర్లలో కూడా అన్షుల్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు. చివరి ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా.. యార్కర్లు, స్లో బాల్స్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నాడు. పవర్‌ప్లే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్లలోనూ రాణించడం అతడిని ప్రత్యేక బౌలర్‌గా నిలబెడుతోంది.

Also Read: Ajinkya Rahane: అదే మా కొంపముంచింది.. ఇక మార్పులు తప్పవు!

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో అన్షుల్ కాంబోజ్ ఇప్పటికే 10 వికెట్లు పడగొట్టాడు. కీలక వికెట్స్ పడగొడుతూ సీఎస్‌కే బౌలింగ్ లైనప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గత సీజన్‌లో కూడా అన్షుల్ రాణించాడు. 8 మ్యాచ్‌లలో 8 వికెట్స్ పడగొట్టాడు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌లలో 10 వికెట్స్ తీశాడు. సీనియర్ పేసర్ల మధ్య యువ ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అన్షుల్ ప్రదర్శన ఇలానే కొనసాగితే.. సీఎస్‌కేకు భవిష్యత్తులో బిగ్ మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2026 కోసం అతడిని చెన్నై రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది.

Exit mobile version