Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

Angkrish Raghuvanshi

Angkrish Raghuvanshi

ఐపీఎల్ 2026లోని 38వ మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మన్ అంగ్క్రిష్ రఘువంశీని అరుదైన వివాదాస్పద రీతిలో ఔట్ చేశారు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ‘ఫీల్డ్‌కు ఆటంకం కలిగించినందుకు’ (Obstructing the Field) అంగ్క్రిష్ రఘువంశీని ఔట్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ నిర్ణయం LSG కెప్టెన్ రిషభ్ పంత్ క్రీడాస్ఫూర్తిపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

అసలు ఘటన ఏమిటి?

మ్యాచ్‌లో KKR ఇన్నింగ్స్‌లో 5వ ఓవర్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చేసిన బంతిని అంగ్క్రిష్ రఘువంశీ మిడ్-ఆన్ వైపు నుజ్ చేశాడు. సింగిల్ తీసుకోవాలని ముందుకు వెళ్లాడు. కానీ నాన్-స్ట్రైకర్ కామెరాన్ గ్రీన్ అతన్ని వెనక్కి పంపాడు. వెనక్కి తిరిగి క్రీజ్‌లోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ అంగ్క్రిష్ తన రన్నింగ్ లైన్‌ను కొంత మార్చుకున్నాడు. ఆ సమయంలో మహమ్మద్ షమీ విసిరిన థ్రో అతని శరీరానికి (కాళ్లకు) తగిలింది. దీంతో LSG ఆటగాళ్లు ముఖ్యంగా షమీ కెప్టెన్ రిషభ్ పంత్ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కోసం అప్పీల్ చేశారు.

ఆన్-ఫీల్డ్ అంపైర్ దీన్ని థర్డ్ అంపైర్‌కు పంపాడు. రీప్లేలు చూసిన థర్డ్ అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీ ఉద్దేశపూర్వకంగా తన దారి మార్చి ఫీల్డర్ థ్రోకు అడ్డుపడ్డాడని తీర్పు ఇచ్చాడు. అంగ్క్రిష్ రఘువంశీ 9(8) బాల్స్‌లో 9 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ డిస్‌మిసల్‌తో KKR పవర్‌ప్లేలోనే ఇబ్బందికి గురైంది.

KKR క్యాంప్ రియాక్షన్

ఔట్ అయిన తర్వాత అంగ్క్రిష్ రఘువంశీ తన బ్యాట్, హెల్మెట్‌ను నేలకు కొట్టి తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. KKR హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ ఫోర్త్ అంపైర్‌తో చాలా సేపు వాగ్వాదం చేశారు. సహాయక కోచ్ షేన్ వాట్సన్ కూడా స్పష్టంగా అసంతృప్తి చెందినట్లు కనిపించారు.

‘ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ నియమం అంటే ఏమిటి?

క్రికెట్ నియమాల ప్రకారం, బ్యాట్స్‌మన్ ఉద్దేశపూర్వకంగా ఫీల్డింగ్ సైడ్‌ను మాటలతో గానీ, చేతలతో గానీ అడ్డుకుంటే లేదా డిస్ట్రాక్ట్ చేస్తే అతన్ని Obstructing the Fieldగా ఔట్ చేయవచ్చు. ఇది MCC లా 37లో పేర్కొన్నారు. ఈ ఘటనలో అంగ్క్రిష్ రఘువంశీ తన రన్నింగ్ లైన్ మార్చడం వల్ల థ్రోకు అడ్డుపడ్డాడని అంపైర్లు భావించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకమా లేదా అక్సిడెంటల్ గా జరిగిందా అనేది వివాదాస్పదంగా మారింది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రకమైన డిస్‌మిసల్స్ (4వ సారి)

యూసుఫ్ పఠాన్ – 72(44) vs PWI, రాంచీ, 2013
అమిత్ మిశ్రా – 1(2) vs SRH, వైజాగ్, 2019
రవీంద్ర జడేజా – 5(6) vs RR, చెన్నై, 2024
అంగ్క్రిష్ రఘువంశీ – 9(8) vs LSG, లక్నో, 2026