Site icon NTV Telugu

PM Modi On Stampede: బెంగళూరులో తొక్కిసలాట.. మృతులకు ప్రధాని మోడీ సంతాపం

Modi

Modi

PM Modi On Stampede: ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడంతో.. బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలు చూడటానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రౌండ్ గేట్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.

Read Also: IPL Chairman: ఆర్సీబీ విక్టరీ పరేడ్ గురించి నాకు తెలియదు..

ఇక, బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రమాదం పూర్తిగా హృదయ విదారకం అన్నారు. ఈ విషాద సమయంలో, తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Exit mobile version