Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
- సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడటం సహజం
- ఫాన్స్ హద్దు మీరడంతో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు
- ఐపీఎల్ 2026లో హద్దు మీరిన లేడీ ఫ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Lady Fan Incident: సాధారణంగా సెలబ్రిటీలను చూడగానే సెల్ఫీలు లేదా ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడటం ఈరోజుల్లో సహజం. అయితే కొందరు ఫాన్స్ హద్దు మీరడంతో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే టీమిండియా యువ సంచలనం, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓపెనర్ అభిషేక్ శర్మకు ఎదురైంది. హోటల్ ప్రాంగణంలో అభిషేక్ శర్మకు ఎదురైన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్స్‌ను సన్‌రైజర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ తన హోటల్ గదికి వెళ్తున్న సమయంలో ఒక మహిళా అభిమాని ఉత్సాహంతో ఒక్కసారిగా అతడి చేతి పట్టుకొని లాగింది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ.. అమ్మాయి చేతి నుంచి అభిషేక్‌ను విడిపించారు. అమ్మాయి చేయి పట్టుకోవడంతో అభిషేక్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ‘ఒకవేళ ఇదే పనిని ఒక పురుష అభిమాని.. మహిళా క్రికెటర్ పట్ల చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?. ఇప్పటికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేవి కదా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. ‘సదరు యువతితో పాటు ఆమె ప్రియుడు కూడా అక్కడే ఉండటం గమనార్హం. తన భాగస్వామి మరొకరి పట్ల అలా ప్రవర్తిస్తుంటే అతను ఎంత ఇబ్బంది పడి ఉంటాడో’ అని మరికొందరు జాలి చూపిస్తున్నారు. ‘అభిమానం ఉండాలి, కానీ అది అవతలి వ్యక్తిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. క్రీడాకారులకు కూడా వ్యక్తిగత గౌరవం ఉంటుందని గుర్తించాలి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Abhishek was going to his hotel room and a girl held his hand which made him uncomfortable. Just imagine the outrage if a boy did this to women’s team. The worst part is that her boyfriend was there how embarrassed he must have felt 🥲 pic.twitter.com/ZpxAhd87uz
— ` (@8eenpoint5) April 25, 2026
తాజావార్తలు
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్‌లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు