భారతదేశంలో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తారు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను ‘దేవుడు’తో పోలుస్తారు. కాగా.. అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని అతడికి హారతి ఇచ్చాడు. ఈ వీడియోకు బాహుబలిలోని ‘దండాలయ్యా’ అనే పాటను యాడ్ చేసి ‘ఎక్స్’ లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ వీడియోపై స్పందించిన కమిన్స్ ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు.
AAP: కష్టాల్లో ఉన్న కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. పార్టీకి మంత్రి రాజీనామా
పాట్ కమిన్స్‌కి ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా చేసిన తర్వాత, కంగారూ జట్టును ఆరోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా నిలబెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
కాగా.. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముల్లన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నితీశ్ రెడ్డి (64) ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయగలిగింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆరెంజ్ ఆర్మీ ఐపీఎల్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.
Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ అది, గెటప్ శ్రీను, 30 ఇయర్స్ పృథ్వి
ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదో స్థానంలో ఉంది. SRH ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడింటిలో గెలువగా.. రెండింటిలో ఓడిపోయింది. కాగా.. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌లు గెలిచిన ఏకైక జట్టు రాజస్థాన్ రాయల్స్ మాత్రమే. నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
https://twitter.com/Bharath_SRH4/status/1777695469042626615
