NTV Telugu Site icon

IPL 2024: ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసిన ఐపీఎల్ 2024!

Ipl 2024

Ipl 2024

Most Hundreds Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసింది. అత్యధిక సెంచరీలు నమోదైన సీజన్‌గా ఐపీఎల్ 2024 నిలిచింది. పూర్తిగా బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన ఈ సీజన్‌లో 14 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ఆల్‌టైమ్ రికార్డ్. ఐపీఎల్ 2023లో 12 శతకాలు నమోదయ్యాయి. 17వ సీజన్‌లో మొత్తం 13 మంది ప్లేయర్స్ సెంచరీలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ 2024లో రెండు సెంచరీలు చేశాడు.

ఐపీఎల్ 2024లో మొదటి సెంచరీని లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టోనిస్ చేశాడు. 63 బంతుల్లో 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ట్రావిస్ హెడ్, విల్ జాక్స్ 41 బంతుల్లోనే శతకాన్ని అందుకుని ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ (113 నాటౌట్), సునీల్ నరైన్ (109), రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్), జానీ బెయిర్‌స్టో (108 నాటౌట్), జోస్ బట్లర్ (107 నాటౌట్), రోహిత్ శర్మ (105 నాటౌట్), యశస్వి జైస్వాల్ (104), సాయి సుదర్శన్ (103), సూర్యకుమార్ యాదవ్ (102 నాటౌట్), ట్రావిస్ హెడ్ (102), జోస్ బట్లర్ (100 నాటౌట్), విల్ జాక్స్ (100 నాటౌట్) సెంచరీలు చేశారు.

Also Read: Jagapathi Babu: నేను మోసపోయా.. వాళ్ల ట్రాప్​లో మీరు పడకండి: జగపతి బాబు

ఐపీఎల్ ఆరంభ సీజన్‌ (ఐపీఎల్ 2008)లో 8 శతకాలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2009లో కేవలం 2 సెంచరీలు మాత్రమే వచ్చాయి. ఐపీఎల్ 2010 నుంచి ఐపీఎల్ 2021 వరకు 7 శతకాలకు మించలేదు. ఐపీఎల్ 2022లో 8 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ 2023లో 12 సెంచరీలు నమోదు కాగా.. ఐపీఎల్ 2024లో 14 శతకాలు నమోదయ్యాయి.