Site icon NTV Telugu

IPL 2022 : ముగిసిన ఎల్‌ఎస్‌జీ బ్యాటింగ్‌.. పంజాబ్‌ లక్ష్యం 154

Lsg

Lsg

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ రోజు ఎంసీఏ స్టేడియం వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఢీ కొట్టనుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్నాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిపొందింది లక్నో సూపర్‌ జెయింట్స్‌. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. టాసో ఓడి బరిలోకి దిగిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆదిలోనే తొలి వికెట్‌ చేజార్చుకుంది. ఆరు పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ రబాడ బౌలింగ్‌లో జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే.. 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న క్వింటన్‌ డికాక్‌(46) సందీప్‌ శర్మ బౌలింగ్‌లో కీపర్‌ జితేశ్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. డికాక్‌ 46 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. దీపక్‌ హుడా 34 పరుగులు చేశాడు. చివర్లో దుశ్మంత చమీర రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో రబాడ 4, రాహుల్‌ చహర్‌ 2, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ తీశాడు.

Exit mobile version