అబుదాబీలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలంలో టాప్ స్టార్లకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ రచిన్ రవీంద్ర, ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దాంతో ఈ ముగ్గురు అన్‌సోల్డ్‌గా మిగిలారు. రచిన్, లివింగ్‌స్టోన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా.. బెయిర్‌స్టో రూ.కోటి కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ ముగ్గురు ఐపీఎల్ 2025లో పేలవ ప్రదర్శన చేయడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో అఫ్గానిస్థాన్‌కు చెందిన రహ్మనుల్లా గుర్బాజ్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రహ్మనుల్లా కనీస ధర రూ.1.50 కోట్లు. జెమీ స్మిత్, గస్ అట్కిన్సన్ కూడా అన్‌సోల్డ్ లిస్టులో ఉన్నారు. వీరి కనీస ధర రూ.2 కోట్లు. భారత ప్లేయర్స్ కేఎస్ భరత్, దీపక్ హుడా, సర్ఫరాజ్ ఖాన్ అన్‌సోల్డ్‌గా ఉన్నారు. ఇక శ్రీలంక క్రికెటర్ హసరంగను రూ.2 కోట్లకు ఎల్‌ఎస్‌జీ కైవసం చేసుకుంది. క్వింటన్ డికాక్ కనీస ధర రూ.కోటికి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. బెన్ డకెట్ కనీస ధర రూ.2 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఫిన్ అలెన్‌ను అతడి కనీస ధర రూ.2 కోట్లకు కేకేఆర్ కైసవం చేసుకుంది.
Also Read: Cameron Green IPL Price: కామెరూన్ గ్రీన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు!
భారత క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు మంచి ధర పలికింది. అతడి కనీస ధర రూ.2కోట్లు కాగా.. రూ.7 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. వెంకటేశ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ తలపడ్డాయి. గతంలో కేకేఆర్ తరఫున వెంకటేశ్ ఆడిన విషయం తెలిసిందే. గతేడాది అడపాదడపా మెరుపులు మినహా పెద్దగా రాణించలేదు. దాంతో కేకేఆర్ అతడిని వదిలేసింది. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తరఫున అయినా మంచి ప్రదర్శన చేస్తాడేమో చూడాలి.
