IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్.. పూర్తి సమాచారం ఇదే!

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
  • రెండు టాప్ టీమ్స్ మధ్య మొదటి మ్యాచ్‌
  • ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే
Ipl 2026 Live Streaming

Ipl 2026 Live Streaming

IPL 2026 Live Streaming, Telecast Details: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌ ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరగనుంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి మొదటి మ్యాచ్ నుంచే ఉత్కంఠభరిత పోరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మెగా టోర్నీని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

భారత్‌లో ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రత్యేకంగా జియో హాట్‌స్టార్‌ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనంతో ఏర్పడిన ఈ ప్లాట్‌ఫారమ్ అభిమానులకు హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను అందించనుంది. అలాగే టీవీలో చూడాలనుకునే వారికి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. భారత్ వెలుపల ఉన్న అభిమానులు కూడా ఐపీఎల్ చూడొచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి దేశాల్లో మ్యాచ్‌లను యప్‌టీవీ ద్వారా వీక్షించవచ్చు.

భాషా పరంగా కూడా అభిమానులు ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఎంజయ్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ వంటి పలు ప్రాంతీయ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు రెండు సమయాల్లో జరుగుతాయి. భారత్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు మొదలవుతాయి. రోజుకు రెండు మ్యాచ్‌లు ఉండే రోజుల్లో అభిమానులకు పూర్తి వినోదం అందనుంది. మొత్తంగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు పూర్తి క్రికెట్ పండుగలా మారనుంది. డిజిటల్, టీవీ, బహుభాషా ప్రసారాలతో ఈసారి ఐపీఎల్ అనుభవం మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది.