IPL 2026 Live Streaming: ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్.. పూర్తి సమాచారం ఇదే!
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం
- రెండు టాప్ టీమ్స్ మధ్య మొదటి మ్యాచ్
- ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2026 Live Streaming, Telecast Details: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీజన్‌లో మొదటి మ్యాచ్ ఎం.చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. రెండు టాప్ టీమ్స్ కాబట్టి మొదటి మ్యాచ్ నుంచే ఉత్కంఠభరిత పోరు ఉండే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మెగా టోర్నీని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.
భారత్‌లో ఐపీఎల్ 2026 లైవ్ స్ట్రీమింగ్‌ను ప్రత్యేకంగా జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనంతో ఏర్పడిన ఈ ప్లాట్‌ఫారమ్ అభిమానులకు హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను అందించనుంది. అలాగే టీవీలో చూడాలనుకునే వారికి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది. భారత్ వెలుపల ఉన్న అభిమానులు కూడా ఐపీఎల్ చూడొచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా వంటి దేశాల్లో మ్యాచ్‌లను యప్‌టీవీ ద్వారా వీక్షించవచ్చు.
Also Read
- ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
భాషా పరంగా కూడా అభిమానులు ఐపీఎల్ 2026 మ్యాచ్‌లను ఎంజయ్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ వంటి పలు ప్రాంతీయ భాషల్లో కామెంటరీ అందుబాటులో ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు రెండు సమయాల్లో జరుగుతాయి. భారత్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. సాయంత్రం మ్యాచ్‌లు 7:30 గంటలకు మొదలవుతాయి. రోజుకు రెండు మ్యాచ్‌లు ఉండే రోజుల్లో అభిమానులకు పూర్తి వినోదం అందనుంది. మొత్తంగా ఐపీఎల్ 2026 సీజన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు పూర్తి క్రికెట్ పండుగలా మారనుంది. డిజిటల్, టీవీ, బహుభాషా ప్రసారాలతో ఈసారి ఐపీఎల్ అనుభవం మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?