DC vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్.. ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DC vs KKR: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఈ రోజు (మే 8) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడుతున్నాయి. ఈ 51వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. నిజానికి ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో ఇటు ఢిల్లీకి, అటు కోల్‌కతాకు గెలుపు అత్యంత కీలకం. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉండటంతో, ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి.
ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ, 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి పట్టికలో వెనుకబడి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. 9 మ్యాచ్‌ల్లో కేవలం 3 విజయాలతో 7 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే కోల్‌కతాదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన మొత్తం మ్యాచ్‌లు 35 అయితే అందులో కోల్‌కతా 19 విజయం సాధించగా, ఢిల్లీ 15 గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు. గత సీజన్‌లో జరిగిన పోరులో కూడా కేకేఆర్ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది.
Also Read
- Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
- Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
- Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
ఢిల్లీ క్యాపిటల్స్: పథుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగీ ఎన్గిడి, ముఖేష్ కుమార్.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామరూన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో అక్షర్ సేన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అటు స్టార్క్ బౌలింగ్, ఇటు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఢిల్లీకి కీలకం కానున్నాయి. కేకేఆర్ తరపున సునీల్ నరైన్, రింకూ సింగ్ ఎలాంటి మెరుపులు మెరిపిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kangana Ranaut: కృతి వివాదం.. కంగనా పాత రక్షాబంధన్ పోస్ట్ వైరల్.. నెటిజన్ల నుంచి ఊహించని ప్రశ్నలు!
-
R Praggnanandhaa: చరిత్ర సృష్టించిన ఆర్. ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
-
Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!